వివో వి20 ప్రో డిసెంబర్ 2 బుధవారం ఆవిష్కరించనున్నట్లు చైనా సంస్థ మీడియా ఇన్విటేషన్ ద్వారా ధృవీకరించింది. సెప్టెంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వివో వి20తో పాటు  వివో వి20ప్రో

 ఫోన్‌ను లాంచ్ చేశారు. వివో వి20ప్రో ముఖ్యమైన ఫీచర్స్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జి SoC, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కెమెరా-ఫోకస్డ్ ఫీచర్ల లిస్ట్ లో డ్యూయల్-వ్యూ వీడియో, స్లో-మోషన్ సెల్ఫీ వీడియో, సూపర్ నైట్ మోడ్, మోషన్ ఆటోఫోకస్ వంటి వాటితో ప్రీలోడ్ చేయబడింది.

వివో వి20ప్రో ఇండియా లాంచ్ తేదీ 
మీడియాకు పంపిన ‘బ్లాక్ యువర్ డేట్’ ఇన్విటేషన్ ప్రకారం, వివో వి20ప్రో ఇండియా లాంచ్ డిసెంబర్ 2న జరుగుతుంది. కొత్త ఫోన్  ప్రకటించెందుకు కంపెనీ వర్చువల్ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉంది.

వివో వి20ప్రో నవంబర్ చివరిలో భారతదేశంలో ప్రవేశిస్తుందని వివో ఇండియా సీఈఓ జెరోమ్ చెన్ గత నెలలో తెలిపారు. అయితే లాంచ్ సంబంధించి వివరాలను అందించలేదు. వివో ఇటీవల ఇండియాలో వివో వి20ప్రో కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. డిసెంబర్ 2 లాంచ్ తేదీని కూడా కొన్ని నివేదికలలో సూచించారు.

also read బ్లాక్ ఫ్రైడే సేల్ 2020: స్మార్ట్ ఫోన్స్ పై ఫ్లాష్ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే .. ...

భారతదేశంలో వివో వి20ప్రో ధర 
భారతదేశంలో వివో వి20ప్రో ధర ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో థాయ్‌లాండ్‌లో ప్రకటించిన దాని ధరకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. సింగిల్ 8జి‌బి + 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ కోసం ఫోన్ టి‌హెచ్‌బి 14,999 అంటే ఇండియాలో సుమారు రూ. 36,600 వద్ద ప్రారంభమవుతుంది.

మూన్ లైట్ సోనాట, మిడ్ నైట్ జాజ్, సన్సెట్ మెలోడీ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది.

వివో వి20ప్రో ఫీచర్స్ 
వివో వి20ప్రో ఆండ్రాయిడ్ 11 ఫన్‌టచ్ ఓఎస్ 11తో వస్తుంది. 6.44-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ 1,080x2,400 పిక్సెల్‌లు అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి SoC చేత శక్తినిస్తుంది, 8జి‌బి ర్యామ్, 128జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్  అందిస్తున్నారు.

ఫోటోగ్రఫీ కోసం వివో వి20ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 64 మెగాపిక్సెల్ ఎఫ్/1.89 లెన్స్‌తో ప్రాధమిక శామ్సంగ్ ఐసోసెల్ జిడబ్ల్యు 1 సెన్సార్ కెమెరా, ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా, ఎ F / 2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరా, డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 44 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా ఉన్నాయి.  4000 ఎంఏహెచ్ బ్యాటరీ, కనెక్టివిటీ కోసం 5జి, 4జి ఎల్‌టిఇ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ అందించారు.