ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో బ్రాండ్ 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో వి20 సేల్స్ ఇండియాలో ప్రారంభించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11తో పనిచేసే భారతదేశంలోని మొట్టమొదటి వివో మొబైల్ ఫోన్. భారతదేశంలో వివో వి20 ధర, ఫీచర్స్, సెల్ ఆఫర్  వివరాలు మీకోసం..

వివో వి20 ఫీచర్స్
సాఫ్ట్‌వేర్ అండ్ డిస్ ప్లే: డ్యూయల్ సిమ్ నానో వివో వి20 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఫన్‌టచ్ ఓఎస్ 11తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.44-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080 × 2,400 పిక్సెల్‌లు) అమోలెడ్ స్క్రీన్‌ తో వస్తుంది.

వివో వి20 ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్: స్పీడ్ అండ్ మల్టీ టాస్కింగ్ కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లో 8 జిబి ర్యామ్, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో 1 టిబి వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది.

బ్యాటరీ: 4000 mAh బ్యాటరీ ఫోన్‌లో అందించగ, ఇది 33 వాట్ల ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: ఫోన్‌లో 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వెర్షన్ 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది.

also read క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారంలోకి పేటీఎం.. ప్రతి లావాదేవీపై క్యాష్‌బ్యాక్‌, రివార్డ్స్ కూడా.. ...

కెమెరా: కెమెరా సెటప్ గురించి మాట్లాడుతూ ఫోన్ వెనుక భాగంలో మూడు బ్యాక్ కెమెరాలు ఇవ్వగా ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎపర్చరు ఎఫ్ / 1.89తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 

ఇది కాకుండా 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా, వీడియో కాలింగ్ కోసం 44 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4 కె సెల్ఫీ వీడియో, సూపర్ నైట్ సెల్ఫీ 2.0, స్లో-మో సెల్ఫీ వీడియో, డ్యూయల్ వ్యూ వీడియో, మల్టీ-స్టయిల్ పోర్ట్రెయిట్స్ ఇచ్చారు.

భారతదేశంలో వివో వి20 ధర
ఈ వివో ఫోన్ మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ చేశారు, మిడ్ నైట్ జాజ్, మూన్ లైట్ సోనాట, సన్ సెట్ మెలోడీ. భారతదేశంలో వివో వి20 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర  రూ.24990 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27990 రూపాయలు.

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, వివో  ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇవి కాకుండా క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ మొదలైన స్టోర్ల ద్వారా కూడా ఫోన్‌లను ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

సెల్ ఆఫర్లు : వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొంటె విషీల్డ్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై ఎస్‌బిఐ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించడంపై 10 శాతం తగ్గింపు ఉంటుంది.