వివో మరో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్...కొత్తగా లాంచ్‌..

వివో వి19 నియో స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా ఫిలిప్పీన్స్‌లో ప్రారంభించారు. అంతకుముందు మార్చిలో ఇండోనేషియాలో ప్రారంభించిన వివో వి19 స్మార్ట్ ఫోన్ లాగానే ఇది ఉంటుంది. క్వాడ్ రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా కోసం సింగిల్ హోల్-పంచ్, సింగల్ వేరిఎంట్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తుంది.

Vivo V19 Neo smart phone Launched in philippines

చైనా టెక్నాలజీ సంస్థ వివో మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. వివో వి19 నియో స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా ఫిలిప్పీన్స్‌లో ప్రారంభించారు. అంతకుముందు మార్చిలో ఇండోనేషియాలో ప్రారంభించిన వివో వి19 స్మార్ట్ ఫోన్ లాగానే ఇది ఉంటుంది. క్వాడ్ రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా కోసం సింగిల్ హోల్-పంచ్, సింగల్ వేరిఎంట్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తుంది.

 ఛార్జింగ్ కోసం 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, ఇన్-డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, ప్లాస్టిక్ బాడీ ప్యానల్ తో రానుంది. ప్రస్తుతానికి వివో స్మార్ట్ ఫోన్ అంతర్జాతీయ, భారత్ లో లభ్యతపై సమాచారం లేదు.


వివో వి19 నియో ధర
వివో వి19 నియో 8 జిబి + 128 జిబి వేరియంట్‌  పిహెచ్‌పి 17,999 (సుమారు రూ .27,200) ధరతో వస్తుంది. అడ్మిరల్ బ్లూ, క్రిస్టల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఫిలిప్పీన్స్ దేశంలో మాత్రమే  దీని సేల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ లభ్యతపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

also read పవర్ ఫుల్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్..

వివో వి19 నియో ఫీచర్స్
వివో వి19 నియో పైన ఫన్ టచ్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ తో వస్తుంది. ఇది 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1,080x2,400 పిక్సెల్‌) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675, 8GB ర్యామ్‌తో వస్తుంది.

వెనుకవైపు నాలుగు, ముందు భాగంలో ఒక కెమెరా ఉన్నాయి. వెనుకవైపు ఉన్న ప్రాధమిక కెమెరా ఎఫ్ / 1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ సెన్సార్ దీనిలో ఉంది. దీనితో వైడ్ యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ముందు వైపు, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, ఎఫ్ / 2.45 ఎపర్చర్‌తో హోల్-పంచ్‌లో ఉంది.

స్టోరేజ్ కోసం 128GB ఆన్‌బోర్డ్ వస్తుంది. వివో వి19 నియోలోని కనెక్టివిటీ ఆప్షన్స్ లో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, 4జి ఎల్‌టిఇ, బ్లూటూత్ వి5.0, జిపిఎస్, ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్, ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్, 4500mAh బ్యాటరీ సామర్థ్యం, ఇది 176 గ్రాముల బరువు ఉంటుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios