Asianet News TeluguAsianet News Telugu

వివో స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే ఆఫర్.. ఏకంగా 4వేల తగ్గింపు..

ఫోన్లు లాంచ్‌ చేసినప్పుడు  వీటి ధర రూ.27,990,  రూ.31,990గా ఉంది. రెండు వేరియంట్లు పియానో ​​బ్లాక్, మిస్టిక్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. అంతేకాకుండా, ఈ కొత్త ధర అన్ని ఆఫ్‌లైన్  రిటైల్ స్టోర్లు, వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.ఇన్, ఇతర ప్రధాన ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో వర్తిస్తుందని వివో వెల్లడించింది. 

vivo announced 4 thousand price cut on popular V19 smartphone
Author
Hyderabad, First Published Jul 29, 2020, 6:28 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో వి19 స్మార్ట్‌ఫోన్‌ పై భారీగా ధర తగ్గింపును ప్రకటించింది. కెమెరా ఫోకస్డ్ ఫోన్ ఇప్పుడు 8జి‌బి+ 128జిబి స్టోరేజ్ రూ .24,990కు, 8జి‌బి + 256జిబి స్టోరేజ్ వేరియంట్‌ రూ .27,990  కొత్త ధరకే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

 ఫోన్లు లాంచ్‌ చేసినప్పుడు  వీటి ధర రూ.27,990,  రూ.31,990గా ఉంది. రెండు వేరియంట్లు పియానో ​​బ్లాక్, మిస్టిక్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. అంతేకాకుండా, ఈ కొత్త ధర అన్ని ఆఫ్‌లైన్  రిటైల్ స్టోర్లు, వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.ఇన్, ఇతర ప్రధాన ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో వర్తిస్తుందని వివో వెల్లడించింది.

ఇండియాలో లాంచ్  చేసిన రెండు నెలల్లోనే ఫోన్‌పై ఏకంగా రూ.4వేలు తగ్గించింది. వివో వి-సిరీస్ స్మార్ట్ ఫోన్ లాగానే, వి19 ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే కెమెరా ఫీచర్స్  మార్కెట్ లోకి తీసుకురావడంపై దృష్టి పెడుతుంది.

ఫోన్‌లో డ్యూయల్ లెన్స్ సెటప్, హోల్-పంచ్ డిస్ ప్లే  తో వస్తుంది. తక్కువ లైట్ లో కూడా ఆకట్టుకునే సెల్ఫీలను తీయడానికి సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ మోడ్ 'మల్టిపుల్-ఎక్స్‌పోజర్' టెక్నిక్‌ను ప్యాక్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

సూపర్ నైట్ మోడ్‌లో ఏ‌ఐ(AI) ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఉంది, ఇది స్పష్టమైన, ప్రకాశవంతమైన & అద్భుతమైన సెల్ఫీలను తక్కువ లైట్ లో ఆటోమేటిక్ గా తీస్తుంది. వివో వి19 స్పెసిఫికేషన్ల పరంగా వి19 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది.

also read ఆఫీస్ కంటే వర్క్‌ ఫ్రోం హోంకే ఉద్యోగుల ఓటు: తాజా సర్వే ...

సెల్ఫీ కెమెరా కోసం డ్యూయల్ పంచ్-హోల్‌, డిస్ ప్లే కింద ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 8జి‌బి  ర్యామ్, 128జిబి స్టోరేజ్ లేదా  256 జిబి స్టోరేజ్ రెండు వెరీఎంట్ లో అందుబాటులో ఉంది.

ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్ స్టాండర్డ్  కెమెరా, 8 మెగాపిక్సెల్ సూపర్-వైడ్-యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ బోకె కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు కోసం డ్యూయల్ పంచ్-హోల్ కెమెరాలు ఉన్నాయి.

రెండింటిలో స్టాండర్డ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మరొకటి అల్ట్రా-వైడ్ 8 మెగాపిక్సెల్ షూటర్ ఉన్నాయి. దీనిలో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్యాక్, 33W వివో ఫ్లాష్‌చార్జ్ 2.0 సపోర్ట్  చేస్తుంది, ఇది కేవలం 30 నిమిషాల్లో 0 నుండి 54 శాతం వరకు ఛార్జింగ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

కనెక్టివిటీ విషయానికొస్తే, వివో వి19 లో బ్లూటూత్ వి5.0, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జ్యాక్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, జిపిఎస్ సపోర్ట్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై ఉన్నాయి.

159.64x75.04x8.5 ఎం‌ఎం పొడవు, 186.5 గ్రాముల బరువు ఉంటుంది. చీకటిలో అదనపు సేఫ్టీ  కోసం తక్కువ లైట్ యాంటీ-ఫ్లికర్ టెక్నాలజీ కూడా ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 10 ను ఫన్‌టచ్ ఓఎస్ 10 పైన పనిచేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios