Asianet News TeluguAsianet News Telugu

ఆండ్రాయిడ్ టీవీలో త్వరలో వీడియో కాల్స్.. గూగుల్ డుయో కొత్త ఫీచర్..

 గూగుల్ డుయో యాప్ త్వరలో ఆండ్రాయిడ్ టీవీలోకి రానుంది. దీనితో మీరు మీ టీవీ నుండి గూగుల్ డుయో యాప్ ద్వారా నేరుగా వీడియో కాల్‌లను చేసుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో, గూగుల్ మీట్‌లో క్రోమ్ కాస్ట్ కోసం గూగుల్ సపోర్ట్ ఇచ్చింది.

Video Calls to Be Available on Android TV Soon with Google Duo new feature
Author
Hyderabad, First Published Aug 29, 2020, 6:24 PM IST

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ వీడియో కాలింగ్ యాప్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఉన్నట్లు అనిపిస్తుంది, ప్రజలు గతంలో కంటే ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి వర్చువల్ పద్ధతులపై ఆధారపడుతున్నారు.

ఇందుకోసం గూగుల్ డుయో యాప్ త్వరలో ఆండ్రాయిడ్ టీవీలోకి రానుంది. దీనితో మీరు మీ టీవీ నుండి గూగుల్ డుయో యాప్ ద్వారా నేరుగా వీడియో కాల్‌లను చేసుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో, గూగుల్ మీట్‌లో క్రోమ్ కాస్ట్ కోసం గూగుల్ సపోర్ట్ ఇచ్చింది.

గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ ఫీచర్ గురించి వెల్లడించింది. ఆండ్రాయిడ్ టీవీలోని గూగుల్ డుయో మీ టీవీ నుండి నేరుగా ఒకరితో ఒకరు లేదా గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవడానికి  సపోర్ట్ చేస్తుంది. మీ టీవీకి ఇంటర్నల్ కెమెరా లేకపోతే, మీరు వీడియో కాల్‌ల కోసం యూ‌ఎస్‌బి కెమెరాను ప్లగ్ చేయవచ్చు.

also read శాంసంగ్, ఒప్పోకు పోటీగా వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ వచ్చేస్తోంది.. ...

గూగుల్ మీట్ హార్డ్‌వేర్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ టిజె వర్గీస్ వీడియో కాల్స్ ఒక మంచి సాధనంగా మారిందని, బహుశా మనమందరం అనుకున్నాదానికంటే  ఎక్కువే ఉపయోగిస్తున్నాం. సరైన డివైజెస్ ఉపయోగించడం వలన వీడియో కాల్స్ మరింత ఆనందంగా, ఆకర్షణీయంగా ఉండటంలో పెద్ద తేడా ఉంటుంది అని అన్నారు.

గూగుల్ కొత్త ఫీచర్ సాధారణ “గూగుల్ డుయో” లోగో పైన ఉంటుంది దాని కింద ప్రివ్యూను చూపిస్తుంది. ఈ చర్య వీడియో-కాలింగ్ కోసం మరిన్ని ఫీచర్లను జోడించెందుకు గూగుల్ వ్యూహంలో ఒక భాగంగా ఉంది.

కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రజలు కనెక్ట్ అయ్యేందుకు, పని చేసే విధానాన్ని కూడా పెంచుతుంది. గూగుల్ మీట్ ఇటీవల క్రోమ్ కాస్ట్ సపోర్ట్ జోడించింది, దీని ద్వారా మీరు మీ ఆన్ లైన్ క్లాసులు, సమావేశాలను పెద్ద స్క్రీన్ పై ప్రసారం చేయవచ్చు.

ఈ ఫీచర్ క్రోమ్ కాస్ట్, క్రోమ్ కాస్ట్ అల్ట్రా, రెండవ తరం క్రోమ్ కాస్ట్ డివైజెస్ లో పని చేస్తుంది. గూగుల్ కొన్ని నెలల క్రితం మీట్ ఆన్ నెస్ట్ హబ్ మాక్స్ ను కూడా ప్రారంభించింది. గూగుల్ డుయోను గూగుల్ మీట్‌తో భర్తీ చేయాలని సెర్చ్ దిగ్గజం యోచిస్తున్నట్లు సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios