వొడాఫోన్ ఐడియా కొత్త వై-ఫై కాలింగ్ సర్వీస్.. దీనివల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకోండి..
వీఐవై-ఫై కాలింగ్ సర్వీస్ మహారాష్ట్ర & గోవా, కోల్‌కతా రెండు సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. తరువాత దశలవారీగా ఇతర సర్కిల్‌లలో ఈ సేవను ప్రారంభించే అవకాశం ఉంది.
న్యూ ఢీల్లీ: వొడాఫోన్ ఐడియా మంగళవారం డిసెంబర్ 15న భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వై-ఫై కాలింగ్’ లేదా ‘వీఐవై-ఫై’ సేవను ప్రారంభించింది.
వీఐవై-ఫై కాలింగ్ సర్వీస్ మహారాష్ట్ర & గోవా, కోల్‌కతా రెండు సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. తరువాత దశలవారీగా ఇతర సర్కిల్‌లలో ఈ సేవను ప్రారంభించే అవకాశం ఉంది.
రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ రెండు టెల్కోలు ఏడాది క్రితమే వై-ఫై కాలింగ్ సేవలను ప్రారంభించాయి. ఒక నివేదిక ప్రకారం వీఐవై-ఫై కాలింగ్ ప్రారంభాన్ని ట్విట్టర్ ద్వారా కంపెనీ కస్టమర్ సపోర్ట్ బృందం ధృవీకరించింది.
డిసెంబర్ 2019లో లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్ లాగానే వీఐవై-ఫై సర్వీస్ పోలి ఉంటుంది. వొడాఫోన్ ఐడియా గత కొంతకాలంగా వై-ఫై కాలింగ్ సేవను పరీక్షిస్తోంది. అయితే వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ విలీనం కారణంగా వీఐవై-ఫై సర్వీస్ వాయిదా పడింది.
ఈ కొత్త సర్వీస్ ఉపయోగం ఏంటంటే వినియోగదారులకు నెట్‌వర్క్ రద్దీ ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు వై-ఫై కాలింగ్‌కు మారడానికి అనుమతిస్తుంది. వై-ఫై ద్వారా వాయిస్ కాలింగ్ సపోర్ట్ జోడించడానికి వినియోగదారులు హ్యాండ్‌సెట్‌లో సాఫ్ట్‌వేర్ అప్ డేట్ అవసరం కావచ్చు.
వీఐ కొత్త రీఛార్జ్ ప్లాన్లు
కొత్త వై-ఫై కాలింగ్ సర్వీస్ రోల్ అవుట్‌తో పాటు వీఐ రూ.59, రూ. 65 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. కొత్త ప్లాన్లు మొదట గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర, గోవా సర్కిల్‌ల కోసం మైవి.ఇన్ సైట్‌లో జాబితా చేసింది.