దేశీయ టెలికాం ఆపరేటర్ వి‌ఐ(వోడాఫోన్ ఐడియా) సెలెక్టివ్ కస్టమర్లకు 1జి‌బి హై-స్పీడ్ డేటాను ఉచితంగా అందిస్తోంది.  ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా ఉచిత డేటా ఏడు రోజుల వాలిడిటీ ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా వి‌ఐగా రీబ్రాండ్  మారిన కొన్ని వారాల తర్వాత ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. గత వారం నుండి  వి‌ఐ రూ.355 ప్లాన్ తో  ఒక సంవత్సరం పాటు జీ5 ప్రీమియం సబ్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వడం ప్రారంభించింది.

వి‌ఐ ఇటీవలే రూ.351 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో 100జి‌బి హై-స్పీడ్ డేటా ఆఫర్ ప్రకటించింది. ఒక నివేదిక ప్రకారం, సెలెక్టెడ్ కస్టమర్లకు ఏడు రోజుల పాటు 1జి‌బి హై-స్పీడ్ డేటా ప్రయోజనాన్ని ఇస్తోంది.

also read వినియోగదారుల ఆన్ లైన్ పేమెంట్ డేటాను ఇతరులతో పంచుకోదు: గూగుల్ పే ...

కస్టమర్లకు ప్రస్తుత ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు  ఈ ఫ్రీ డేటా అదనంగా లభిస్తుంది. ఎస్‌ఎం‌ఎస్ ద్వారా ఉచిత 1జి‌బి డేటా ఆఫర్ గురించి సెలెక్టెడ్  కస్టమర్లకు తెలియజేస్తున్నారు.

అదనపు ఫ్రీ డేటా గురించి మై వొడాఫోన్ పేరుతో ఉన్న విఐ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకొవచ్చు. ప్రమోషనల్ ఆఫర్ కింద అందిస్తున్న ఫ్రీ 1 జిబి హై-స్పీడ్ డేటా వాలిడిటీ పూర్తి అయిన తర్వాత మీకు ఈ ఆఫర్ వర్తించదు.

ఉచిత హై-స్పీడ్ డేటా అందిస్తున్న టెలికాం  విఐ మాత్రమే కాదు, రిలయన్స్ జియో కూడా తరచుగా సెలెక్టెడ్  కస్టమర్లకు ఇలాంటి ఫ్రీ డేటా ఆఫర్ అందిస్తుంది. జూలైలో ఎయిర్ టెల్ కూడా 1జి‌బి ఫ్రీ హై-స్పీడ్ డేటాను కొంతమంది వినియోగదారులకు మూడు రోజులు వాలిడిటీతో అందించింది.

ఈ నెల ప్రారంభంలో వోడాఫోన్ ఐడియా కొత్త రిబ్రాండ్ గుర్తింపుతో విఐ మారిన విషయం మీకు తెలిసిందే.