వి‌ఐగా రీబ్రాండెడ్ అయిన వోడాఫోన్ ఐడియా రూ.1197 ప్రీపెయిడ్ ప్లాన్ లభ్యతను విస్తరించింది. ఈ ప్లాన్ గతంలో హోమ్ క్రెడిట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ బండిల్‌ను మాత్రమే కొనుగోలు చేసే వినియోగదారులకు అందుబాటులో ఉండేది.

4జి స్మార్ట్‌ఫోన్‌లకు ఆర్థిక సదుపాయం కల్పించడానికి వోడాఫోన్ 2019లో హోమ్ క్రెడిట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హోమ్‌క్రెడిట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు మాత్రమే వోడాఫోన్ రూ.1197 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పొందగలరు.

అయితే ఇప్పుడు వోడాఫోన్ ఐడియా ఈ ప్లాన్ విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ భారతదేశం అంతటా అందుబాటులో ఉంది. అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫాంల ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రిచార్జ్ చేయవచ్చు.

also read మీ ఫ్రెండ్స్ వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ ట్రిక్ మీకోసమే.. ...

వి‌ఐ రూ.1197 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 1.5జి‌బి రోజువారీ డేటా, ఆన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌ అందిస్తుంది. 180 రోజుల వాలిడిటీతో రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్‌ఎంలు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో వి‌ఐ మూవీస్, టివికి యాక్సెస్ అందిస్తుంది. అలాగే ఆ వారంలో వాడకుండా మిగిలి ఉన్న డేటాను తిరిగి వారం చివరి రోజులో వాడుకోవచ్చు.

రూ.1197 ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులోకి రాకముందు, 1.5 జిబి రోజువారీ డేటాను రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా  84 రోజులు వాలిడిటీతో అందించింది.  రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌ను వరుసగా 365 రోజుల వాలిడిటీతో అందించింది.

రూ.2,595 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకి 2జీబీ డేటాతో పాటు ఒక సంవత్సరం వరకు ఉచితంగా జి5 ప్లాట్‌ఫామ్‌ మెంబర్‌షిప్ లభిస్తుంది. 

రూ 599 ప్రీపెయిడ్ ప్లాన్ కోసం యాప్‌తో రీఛార్జ్ చేస్తే అదనంగా 5 జీబీ డేటాను ఇస్తుంది. రూ.599, రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్లు రెండూ వారాంతపు డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాన్ని ఇస్తాయి.

ఈ ప్లాన్ల అదనపు ప్రయోజనాలు ఎంపిఎల్‌లో మీకు ఇష్టమైన గేమ్ ఆడటానికి రూ .125 బోనస్ క్యాష్, వీ మూవీస్, టీవీ యాక్సెస్‌తో జోమాటో నుండి ఫుడ్ ఆర్డర్‌లపై రోజూ 75 రూపాయల డిస్కౌంట్ పొందుతారు.