వోడాఫోన్ ఐడియా రీబ్రాండ్ వి‌ఐ టెలికాం వాల్యు-ఆడెడ్  సర్వీస్ ద్వారా ఎనిమిది  కొత్త యాడ్-ఆన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. గేమ్స్, స్పొర్ట్స్, కాంటెస్ట్, స్టార్ టాక్, గేమ్స్ లాంగ్ వాలిడిటీ, స్పోర్ట్స్ లాంగ్ వాలిడిటీ, కాంటెస్ట్ లాంగ్ వాలిడిటీ, స్టార్ టాక్ లాంగ్ వాలిడిటీ వంటి కొత్త వి‌ఐ  ప్యాక్‌లు యాడ్ ఫ్రీ ప్రయోజనాలతో పాటు యాడ్-ఆన్‌గా లభిస్తాయి.  

ఈ ఆఫర్ వాలిడిటీ 89 రోజులు. వి‌ఐ టెలికాం ప్రస్తుతం ఉన్న మొత్తం 23 సర్కిల్‌లలో ఇది అందుబాటులో ఉంది. వి‌ఐ సైట్‌లోని జాబితా ప్రకారం కొత్త వి‌ఐ యాడ్-ఆన్ ప్యాక్‌ ధరలు రూ.32 నుంచి మొదలై రూ.

also read పబ్‌జీ గేమ్ లవర్స్ కి షాక్.. ఇండియాలోకి మళ్ళీ ఇక రాదు, ఉండదు.. ...

103 వరకు ఉన్నాయి. రూ.32 వి‌ఐ గేమ్స్ ప్యాక్ ఇందులో చౌకైనది, దాదాపు 200కి పైగా పాపులర్ గేమ్స్ కి యాడ్ ఫ్రీ అక్సెస్ లభిస్తుంది. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. స్పొర్ట్స్ లవర్స్ కోసం రూ.42 స్పోర్ట్స్ ప్యాక్ కూడా ఉంది.

ఈ ప్యాక్ ద్వారా క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్ లిమిటెడ్ క్రికెట్ స్కోరు అలెర్ట్స్ ఎస్‌ఎం‌ఎస్ ద్వారా తెలుపుతుంది.  దీంతోపాటు క్రీడా ప్రముఖులతో మాట్లాడటానికి అవకాశం కూడా లభిస్తుంది. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు.

కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాలను ఎక్కువ కాలం వాలిడిటీ పొందాలనుకునే వినియోగదారులకు వి‌ఐలో గేమ్స్, స్పొర్ట్స్, స్టార్ టాక్ లాంగ్ వాలిడిటీ ప్యాక్స్ ఉన్నాయి.

టెలికాం ఆపరేటర్ అందించే కొన్ని ఇతర యాడ్-ఆన్ ప్యాక్‌లాగా కాకుండా, ఈ ఎనిమిది కొత్త ప్యాక్స్ డేటా లేదా ఎస్‌ఎం‌ఎస్‌ ప్రయోజనాలను అందించదు.