జాతీయ భద్రత కారణాల దృష్ట్యా  చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించడానికి శనివారం వెంటనే చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ యాప్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు శుక్రవారం కూడా వార్తలు వచ్చాయి.  అయితే టిక్‌టాక్‌ను కొనుగోలు విషయంలో  మైక్రోసాఫ్ట్‌ యాజమాన్యం ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు.

‘మేము తప్పుడు వార్తలు, ఊహాగానాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయము. మాకు టిక్‌టాక్‌ దీర్ఘకాలిక విజయంపై నమ్మకం ఉంది’ అని తెలిపింది. గతకొన్ని రోజులుగా అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరమవుతున్న విషయం తెలిసిందే.

also read అంతర్జాతీయ విమానాలు ఆగస్టు 31 వరకు బంద్: డిజిసిఎ ...

ఈ క్రమంలో చైనా కంపెనీలు వారి ప్రభుత్వానికి యూసర్ల డేటాను చేరవేస్తున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా చైనా యాప్‌లు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అమెరికా ఉపక్రమించింది.

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ టిక్‌టాక్‌ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉందంటూ ఒక ఇంగ్లిష్ పత్రిక కథనం ప్రచురించింది. ఇందుకు సంబంధించిన చర్చలు సోమవారం వెలువడే అవకాశం ఉందని, బిలియన్‌ డాలర్లతో కూడిన ఒప్పందం గురించి మైక్రోసాఫ్ట్‌ శ్వేతసౌధంతో కూడా సంప్రదింపులు జరిపినట్లు పేర్కొనడం బిజినెస్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

యూఎస్ జాతీయ-భద్రతా అధికారులు మ్యూజికల్లీ యాప్ కొనుగోలును సమీక్షిస్తున్నారన్న విషయం తెలిసిందే. టిక్‌టాక్‌ను నిషేధించడాన్ని అమెరికా పరిశీలిస్తోందని విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో గత న ప్రారంభంలో పేర్కొన్న విషయం తెలిసిందే.