యు.ఎస్. చరిత్రలో అతిపెద్ద సైబర్-దాడి.. అసలేం జరిగింది..?
గత రెండురుజుల్లో జరిగిన పరిణామాల ప్రకారం అమెరికాలోని కొన్ని మొబైల్ నెట్వర్క్ వినియోగదారులకు నిన్న అంతరాయం కలిగింది. కాల్స్, మెసేజెస్, ఇంటర్నెట్ సేవలు ఒకేసారి స్తంభించిపోయాయి. దీంతో చాలా మంది కస్టమర్లు వారి నెట్వర్క్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేశారు.
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఎప్పటి వరకు ఎప్పుడు లేని అతిపెద్ద సైబర్ దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. గత రెండురుజుల్లో జరిగిన పరిణామాల ప్రకారం అమెరికాలోని కొన్ని మొబైల్ నెట్వర్క్ వినియోగదారులకు నిన్న అంతరాయం కలిగింది.
కాల్స్, మెసేజెస్, ఇంటర్నెట్ సేవలు ఒకేసారి స్తంభించిపోయాయి. దీంతో చాలా మంది కస్టమర్లు వారి నెట్వర్క్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేశారు. వందల వేల మంది మొబైల్ వినియోగదారులు ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోవటంతో 'డిడోస్' ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయ్యింది.
కొందరు దీనికి చైనా కారణం అంటూ నిందలు వేస్తూ, అతి పెద్ద సైబర్ దాడి జరుగబోతోందని వదంతులు ఒక్కసారి వెల్లువెతాయి.
జూన్ 15 మధ్యాహ్నం యు.ఎస్ నగరం అంతటా ప్రజలు కాల్స్, మెసేజెస్ పంపలేకపోతునట్లు గమనించడం ప్రారంభించారు. కస్టమర్ కేర్ ఫిర్యాదులతో సోషల్ మీడియాలో మొబైల్ నెట్వర్కులు అంతరాయాలను ఎదుర్కొంటున్నాయన్న వార్తా ఒక్కసారి అంతటా విస్తరించింది.
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ నుండి బ్యాంకింగ్ వరకు ఆన్‌లైన్ సేవలు అన్నీ డొమినో మాదిరిగా తగ్గుతున్నాయి.
యువర్ అనన్ సెంట్రల్ "యూ.ఎస్ ప్రస్తుతం ఒక పెద్ద డిడిఓఎస్ దాడిలో ఉంది" అని ట్వీట్ చేసింది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేయడానికి మ్యాప్‌ను కూడా కలిగి ఉంది.
also read శాంసంగ్ సరికొత్త టీవీలు... తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్స్... ...
తక్కువ సమయం లోనే డిడిఓఎస్ (డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్) హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయింది. ఎవరికైనా ఏదైనా కనెక్టివిటీ సమస్యను ఎదుర్కొంటున్న వారు ఇది నిజంగానే ఈ పెద్ద సైబర్ దాడి అంటూ నిందించటం మొదలు పెట్టారు. దీంతో మీడియా సంస్థలు దీనిపై చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి అని వార్తా కథనాలను ప్రచురించారు.
వన్నాక్రై వార్న్ నుండి ఇంటర్నెట్‌ను రక్షించిన హ్యాకర్ మార్కస్ హచిన్స్ ట్వీట్ దీనిపై ట్వీట్ చేశాడు. అతి పెద్ద సైబర్ దాడి అంటూ ప్రచారమవుతున్న దానిలో నిజం లేదని అది డిడిఓఎస్ ట్రాఫిక్ నమూనా అని తెలిపాడు.
అసలు జరిగింది?
టి-మొబైల్ సిఇఒ మైక్ సివెర్ట్ ఒక ప్రకటన విడుదల చేశారు. టి-మొబైల్ లో వాయిస్, టెక్స్ట్ మెసేజెస్ సమస్యను ఎదుర్కొంటోంది. ఇది యు.ఎస్. అంతటా ఉండే వినియోగదారులపై ప్రభావితం చేసింది. ఈ సమస్య నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైంది. ఇది ఐపి ట్రాఫిక్ సంబంధిత సమస్య అని ఇది రోజంతా నెట్‌వర్క్ కోర్‌లో కాపాసిటీ సమస్యలను సృష్టించింది అని ఆయన చెప్పారు. జూన్ 16 తెల్లవారుజామున ఈ సమస్య తొలగించేసాము అని ప్రస్తుతం ఇంటర్నెట్ సాధారణ స్థితికి వచ్చింది అని సోషల్ మీడియా పుకార్లలో వాస్తవం లేదని ఆన్నారు.