టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తానిష్క్ జ్యూవెలర్స్ వివాదం తరువాత, ఇప్పుడు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పై  నిషేదం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. హిందూ మత మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో బైకాట్ అమెజాన్ హ్యాష్‌ట్యాగ్ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్  అవుతుంది.

ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. అమెజాన్‌పై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇందుకు కారణం  డోర్ మ్యాట్స్ పై ఓం అని ముద్రించి ఉండటం.

అమెజాన్  సైట్ లో ఓం అని ముద్రించిన డోర్ మ్యాట్ లు ప్రత్యక్ష్యమయ్యాయి, ఇది హిందూ మతం పవిత్రమైన  'ॐ' చిహ్నం. ఇది మాత్రమే కాదు, హిందూ దేవతల ఫోటోలు, హిందూ శాసనాలు కూడా కొన్ని లోదుస్తులలో పై ముద్రించి అమ్మకానికి పెట్టారు.

దీనివల్ల ప్రజలు అమెజాన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఒక వినియోగదారు వీటిని చూపిస్తు "నేను హిందుత్వ మతానికి మద్దతుగా అమెజాన్‌ను బహిష్కరించాను" అంటూ ట్వీట్ చేశాడు. ట్వీట్ తో పాటు అమెజాన్‌లో  హిందూ దేవతల ఫోటోలు ఉన్న లోదుస్తుల ఫోటోలను కూడా షేర్ చేశారు.

also read మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ల.. అయితే అధిక డాటా, ఫ్రీ కాల్స్ అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ మీకోసమే... ...

అలాగే అమెజాన్‌కు మద్దతుగా మరికొంతమంది ఇందులో అమెజాన్ తప్పు ఏమిటి, ఇది వస్తువులను అమ్మడానికి ఒక వేదిక మాత్రమే అని కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్ ఇలాంటి పని చేయడం ఇదే మొదటిసారి కాదు.

అంతకుముందు, అమెరికాకు చెందిన ఈ-కామర్స్ సంస్థ డోర్ మ్యాట్స్, టాయిలెట్ సీట్లపై గోల్డెన్ టెంపుల్, భారతదేశ జెండా, గణేశుడి ఫోటోని ప్రదర్శించడంతో ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొంది.

దీపావళి పండుగ సీజన్‌కు ముందు తనీష్క్ జ్యూవెలర్స్ ఒక కొత్త ప్రకటన కారణంగా వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రకటనలో హిందూ బాలికను ముస్లిం కుటుంబంతో వివాహ సన్నివేశం ఉంది. ఈ 45 సెకన్ల వీడియోలో హిందూ ముస్లిం ఐక్యత గురించి సందేశం ఇచ్చే ప్రయత్నం జరిగింది.

కానీ ఈ వీడియో ప్రకటన వైరల్ అయిన తరువాత #BoycottTanishq ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యింది. వివాదం ముదిరిన తరువాత తనష్క్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈ వీడియోను తొలగించారు.