Asianet News TeluguAsianet News Telugu

స్టైలస్ పెన్‌, ట్రిపుల్ రియర్ కెమెరాతో ఎల్‌జి కె71 స్మార్ట్ ఫోన్..

 పూర్తి-హెచ్‌డి + డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించారు. స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ ఫోన్ పక్కకి స్ప్రింగ్-లోడెడ్ స్టైలస్ పెన్‌తో వస్తుంది, అది అవసరం లేనప్పుడు ఫోన్‌లోకి స్లాట్ చేయవచ్చు. 

Triple Rear Cameras, Stylus pen LG K71 smartphone Launched: Specifications here
Author
Hyderabad, First Published Sep 22, 2020, 12:45 PM IST

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఎల్‌జీ సరికొత్త మిడ్ రేంజ్ కె71 స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. పూర్తి-హెచ్‌డి + డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించారు. స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ ఫోన్ పక్కకి స్ప్రింగ్-లోడెడ్ స్టైలస్ పెన్‌తో వస్తుంది, అది అవసరం లేనప్పుడు ఫోన్‌లోకి స్లాట్ చేయవచ్చు.

ఎల్‌జీ  కె71 సింగిల్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఎల్జీ కె71 ధర వివరాలను, ఇండియాలో లభ్యతపై  సమాచారం లేనప్పటికి ఈ ఫోన్ అమ్మకాలు కోస్టా రికా, డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హోండురాస్, నికరాగువా, ఈక్వెడార్, పనామాలో ప్రారంభించింది. హోలో టైటాన్, హోలో వైట్ అనే రెండు కలర్ ఆప్షన్స్  లో వస్తుంది.

ఎల్జీ కె71 ఫీచర్స్ 
ఎల్జీ కె71 ఆండ్రాయిడ్ 10 కస్టమ్ యూ‌ఐతో పనిచేస్తుంది. 6.8-అంగుళాల పూర్తి-హెచ్‌డి + యు-నాచ్ డిస్ ప్లే, ఆక్టా-కోర్ మెడిటెక్ హెలియో P35 SoC (MT6765), 4జి‌బి ర్యామ్ ఉంది.

also read మీరు మీ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ చేసే ముందు వీటిని గుర్తించుకోండి.. ...

వెనుక కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, వైడ్ యాంగిల్ లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి.

ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా  అందించారు. ఎస్‌డి కార్డ్ ద్వారా 128జి‌బి వరకు  స్టోరేజ్ ఆప్షన్ అందించారు. కనెక్టివిటీ ఆప్షన్స్ లో వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎల్‌టిఇ, జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫ్లష్ లైట్ ఉంటుంది. 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, గూగుల్ అసిస్టెంట్ బటన్, స్మార్ట్ ఫోన్ 220 గ్రాముల బరువు ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios