అంతా ఫేక్: 11 అంకెల మొబైల్​ నంబర్ ఊసే లేదు.. తేల్చేసిన ట్రాయ్

దేశంలో 11 డిజిట్స్​తో కూడిన మొబైల్​ నంబర్లు రానున్నాయన్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేసింది ట్రాయ్​. ప్రస్తుతం ఉన్న 10 అంకెల మొబైల్​​ నంబర్లే కొనసాగనున్నట్లు తెలిపింది.
 

Trai says not recommended 11 digit mobile numbering plan, 10-digit numbers to continue

న్యూఢిల్లీ: మొబైల్​ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా త్వరలో​ 11 డిజిట్స్​ మొబైల్​ నంబర్​ వస్తున్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్​) ఖండించింది. అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఉన్న 10 అంకెల నంబర్లే కొనసాగుతాయని తేల్చిచెప్పింది."ట్రాయ్​ చేసిన 11 డిజిట్స్​ మొబైల్​ నంబర్​ ప్రతిపాదన వల్ల భారీ సంఖ్యలో కొత్త నంబర్లు పుట్టుకు వస్తాయి" అని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇలా చేయటం వల్ల కమ్యూనికేషన్​ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగి టెలికాం రంగం అభివృద్ధి చెందుతుందని విశ్లేషించాయి. 

వీటిని ట్రాయ్ తోసిపుచ్చింది. దేశంలో మొబైల్ నంబర్లు వినియోగం పెరిగిన కారణంగా 2003లో ట్రాయ్​ అప్పుడు వాడుకలో ఉన్న 9 సిరిస్​తో పాటు 8,7,6తో మొదలయ్యే నంబర్​ను తీసుకువచ్చింది. ఫలితంగా భారీ సంఖ్యలో కొత్త నెంబర్లు పుట్టుకువచ్చాయి.

also read మైక్రోసాఫ్ట్ మీడియా స్టాఫ్‪కు షాక్: కృత్రిమ మేధతో జర్నలిజం విధులు!

ఇంతకుముందు మొబైల్‌ ఫోన్‌ నంబర్లు మరింత పెద్దగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఉన్న 10 అంకెల స్థానే 11 అంకెల నంబర్‌ తీసుకు రావాలని ట్రాయ్‌ భావిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదిక కూడా  విడుదల చేసింది.

ప్రస్తుతం ఉన్న పది నంబర్ల విధానంతో, దేశంలో 700 కోట్ల మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు మాత్రమే సాధ్యం. అదే 11 అంకెలకు మారిస్తే వెయ్యి కోట్ల కనెక్షన్లు ఇవ్వొచ్చని ట్రాయ్‌ తెలిపింది. 

దీనికి తోడు ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌ ఫోన్లకు కాల్‌ చేసేటపుడు, ఆ మొబైల్‌ నంబరు ముందు ‘సున్నా’ యాడ్‌ చేయాలని సూచించింది. కానీ ‘0‘ నంబర్ కు ముందు చేర్చాలని లాండ్ లైన్ నుంచి ఫోన్ చేసే వారికి మాత్రమే వర్తింప జేయాలని ప్రతిపాదించామని ట్రాయ్ వివరణ ఇచ్చింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios