టైమెక్స్ ప్రీమియం యాక్టివ్ ఐకనెక్ట్ స్మార్ట్ వాచ్ భారతదేశంలో లాంచ్ చేశారు. కొత్త స్మార్ట్ వాచ్ మృదువైన సిలికాన్ బెల్ట్ లేదా సౌకర్యవంతమైన స్టెయిన్ లేస్ స్టీల్ మెష్ బ్యాండ్  ఆప్షన్ లో వస్తుంది. ఇందులో కాల్స్, క్యాలెండర్ ఈవెంట్‌ల కోసం ప్రత్యేకమైన నోటిఫికేషన్‌ ఫీచర్స్ ఉన్నాయి.  

హార్ట్ రేట్ సెన్సార్, సెడెంటరీ రిమైండర్, ఆక్టివిటీ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, మ్యూజిక్ ప్లేబ్యాక్ సపోర్ట్  కూడా ఉన్నాయి. టైమెక్స్ ప్రీమియం యాక్టివ్ ఐకనెక్ట్ స్మార్ట్ వాచ్ ఐ‌పి68 వాటర్ రెసిస్టెంట్ తో ఐదు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

టైమెక్స్ ప్రీమియం యాక్టివ్ ఐకనెక్ట్ స్మార్ట్ వాచ్ ధర  
టైమెక్స్ ప్రీమియం యాక్టివ్ ఐకనెక్ట్ స్మార్ట్ వాచ్ సిలికాన్ స్ట్రాప్ వేరియంట్‌ ధర రూ. 6,995, స్టెయిన్లెస్ స్టీల్ మెష్ వేరియంట్‌ ధర రూ. 7,295. సిలికాన్ పట్టీ బ్లాక్, పింక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది, అయితే స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ సిల్వర్, గోల్డ్ ఫినిషింగ్ లో వస్తుంది.

టైమెక్స్ ఇండియా వెబ్ సైట్, ఇతర ఆథరైజేడ్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

also read స్టూడెంట్స్, టీచర్స్ కోసం వన్‌ప్లస్ ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్.. అదనంగా 5% డిస్కౌంట్ కూడా.. ...

టైమెక్స్ ప్రీమియం యాక్టివ్ ఐకనెక్ట్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు
టైమెక్స్ ప్రీమియం యాక్టివ్ ఐకనెక్ట్ స్మార్ట్ వాచ్ దీర్ఘచతురస్రాకార ఆకారంలో 36 ఎంఎం డయల్,  టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంది. ఇది ఐ‌పి68 వాటర్ రెసిస్టెంట్ కూడా. టైమెక్స్ ప్రీమియం యాక్టివ్ ఐకనెక్ట్ స్మార్ట్‌వాచ్  ఐకనెక్ట్ టైమెక్స్ 2 మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అవుతుంది.

కనెక్టివిటీ కోసం బ్లూటూత్  అందించారు. ఛార్జింగ్ కోసం మాగ్నెటిక్ పిన్ను కూడా ఉంది.