ఫేస్‌బుక్ ని ఓడించి అధ్యధిక డౌన్‌లోడ్లతో నంబర్ 1గా టిక్ టాక్.. 2020లో టాప్ 10 యాప్స్ ఇవే ?

మొబైల్ యాప్ విశ్లేషణ సంస్థ ఆని ప్రొజెక్షన్ ప్రకారం వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ వచ్చే ఏడాది 100 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్ క్లబ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. 

TikTok beats Facebook apps  to become most downloaded app of 2020: App Annie Report

షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను ఇండియాలో భారత ప్రభుత్వం నిషేధించిన తరువాత 2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గా టిక్ టాక్ నిలిచింది. మొబైల్ యాప్ విశ్లేషణ సంస్థ ఆని ప్రొజెక్షన్ ప్రకారం వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ వచ్చే ఏడాది 100 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్ క్లబ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది.

ఆత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్ జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్న మొబైల్ యాప్‌లు మొదటి స్థానంలో టిక్‌టాక్, రెండవ స్థానంలో ఫేస్‌బుక్, మూడవ స్థానంలో వాట్సాప్, నాల్గవ స్థానంలో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ క్లౌడ్ ఉంది.

ఫోటో-వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఐదవ స్థానంలో, ఆరో స్థానంలో ఫేస్‌బుక్ మెసెంజర్, గూగుల్ మీట్ కూడా ఈ జాబితాలో ప్రవేశించి ఏడవ స్థానంలో నిలిచింది. ఎనిమిదో స్థానంలో స్నాప్‌చాట్ , తొమ్మిదో స్థానంలో టెలిగ్రామ్, పదో స్థానంలో లైక్ వంటి మొబైల్ యాప్స్ స్థానాన్ని సంపాదించాయి.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ గణాంకాలు జనవరి 2020 నుండి నవంబర్ వరకు తీసుకున్నది. గూగుల్ ప్లే స్టోర్, ఐ‌ఓ‌ఎస్ ఆపిల్ యాప్ స్టోర్ నుండి డాటా తీసుకోబడింది.

ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఇంట్లోనే ఉండవలసి రావడంతో 2020లో మొబైల్ వాడకం గణనీయంగా పెరిగిందని ఈ నివేదికలో పేర్కొంది. అలాగే మొబైల్ ఫోన్లు వినోదానికి ప్రధాన వనరులుగా మారాయి.

also read మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఎస్‌ఎం‌ఎస్ పంప‌లేక‌పోతున్నారా.. అయితే ఈ యాప్ వెంటనే డిలెట్ చేయండి.. ...

ఈ సంవత్సరంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గడిపిన సమయం 330 కోట్ల గంటలకు చేరింది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందడంతో బిజినెస్ యాప్స్  ఈ సంవత్సరానికి 200 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

తరువాత స్ట్రీమింగ్ యాప్స్  40 శాతం వృద్ధిని సాధించింది, ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎక్కువగా  సినిమాలు, వెబ్ సిరీస్ చూడటం ప్రారంభించారు. గేమింగ్ యాప్స్ డౌన్‌లోడ్‌లు కూడా 35 శాతం పెరిగాయి.

ప్రజలు ఎక్కువ సమయం ఏ యాప్ పైన గడిపారంటే ?

ఎక్కువ సమయం గడపడం గురించి చెప్పాలంటే  చాలా మంది టిండర్ వంటి యాప్స్ లో ఎక్కువ సమయం గడిపారు. గడిపిన సమయాన్ని బట్టి టిండర్ యాప్ అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత టిక్‌టాక్, యూట్యూబ్, డిస్నీ ప్లస్, టెన్సెంట్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ఇతర యాప్స్ ఉన్నాయి.

ప్రజలు ఏ మొబైల్ గేమ్ ఎక్కువ ఇష్టపడుతున్నారంటే ?

గేమ్స్ గురించి చెప్పాలంటే ఫ్రీ ఫైర్ వరల్డ్‌వైడ్ అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన గేమ్‌గా నిలిచింది. ఈ జాబితాలో ఫ్రీ ఫైర్ తరువాత సబ్వే సర్ఫర్‌లతో పాటు  పబ్-జి మొబైల్, గార్డెన్‌స్కేప్స్: న్యూ వంటి గేమ్స్ ఉన్నాయి.

మంత్లీ యాక్టివ్ యూజర్స్ విషయంలో ఎవరు ముందున్నారంటే ?

ఫేస్ బుక్ యాజమాన్యంలోని యాప్స్ యాక్టివ్ యూజర్స్ జాబితాలో బలమైన స్థానాన్ని సంపాదించాయి. ఈ జాబితాలో మొదటి 4 యాప్స్ ఫేస్‌బుక్ నుండి వచ్చిన ఫేస్‌బుక్‌ మొదటి స్థానంలో, రెండవ స్థానంలో వాట్సాప్, మూడవ స్థానంలో ఫేస్‌బుక్ మెసెంజర్, నాలుగవ స్థానంలో ఇన్‌స్టాగ్రామ్ ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios