టిక్‌టాక్ యాప్‌ డిలేట్ చేయండి అంటూ ఇమెయిల్.. పొరపాటు అని క్లారీటి..

"భద్రతా ప్రమాదాల" పై ఉద్యోగులు యాప్ తొలగించాలని శుక్రవారం సిబ్బందికి పంపిన ఇంటర్నల్ మెమోలో పేర్కొంది. చైనా కంపెనీ యాజమాన్యంలోని ఈ యాప్ చైనాతో డేటాను పంచుకుంటుంది అనే భయంతో పరిశీలనలోకి వచ్చింది.

TikTok ban: Amazon clarifys email asking staff to remove app 'sent in error'

తమ కంపెనీ ఇమెయిల్‌ను మొబైల్ డివైజ్ నుండి యాక్సెస్ చేయగల వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను డిలెట్ చేయమని కోరుతూ ఉద్యోగులకు పంపిన ఇమెయిల్ పొరపాటున పంపినట్లు అమెజాన్ తెలిపింది. "భద్రతా ప్రమాదాల" పై ఉద్యోగులు యాప్ తొలగించాలని శుక్రవారం సిబ్బందికి పంపిన ఇంటర్నల్ మెమోలో పేర్కొంది.

చైనా కంపెనీ యాజమాన్యంలోని ఈ యాప్ చైనాతో డేటాను పంచుకుంటుంది అనే భయంతో పరిశీలనలోకి వచ్చింది. అమెజాన్ వైఖరీ మాకు అర్దం కాలేదని టిక్‌టాక్ తెలిపింది."ఈ ఉదయం మా ఉద్యోగులలో కొంతమందికి ఇమెయిల్ పంపబడింది. టిక్‌టాక్‌కు సంబంధించి ప్రస్తుతం మా విధానాలలో ఎటువంటి మార్పు లేదు" అని కంపెనీ చెప్పింది.

also read టిక్‌టాక్‌ ఔట్‌: స్వదేశీ పరిజ్ఞానానికి ప్రోత్సాహం.. రెడీ అవుతోన్న ‘పాప్‌‌-ఇన్‌’ యాప్‌ ...

అయితే అంతకుముందు శుక్రవారం కొన్ని  వార్తా సంస్థలు సిబ్బందికి పంపిన మెమోలో మొబైల్ డివైజ్ నుండి యాప్ తప్పనిసరిగా తొలగించాలని పేర్కొంది అని వెల్లడించాయి. అమెజాన్‌ ఉద్యోగవర్గాల సమాచారం ప్ర‌కారం టిక్‌టాక్ యాప్‌ను ఫోన్లనుంచి తొలగించాలని ఉద్యోగుల‌కు మొయిల్ పంపగా, ఆ విష‌యం టిక్‌టాక్ ప్ర‌తినిధికి చేరింది.

దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన ఆయ‌న అమెజాన్ ప్ర‌తినిధి జాకీ అండ‌ర్స‌న్‌తో ఈ విషయంపై చర్చించారు. ఆ వెంటనే టిక్‌టాక్ నిషేధంపై అమెజాన్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు సమాచారం. టిక్‌టాక్‌ నిషేధంపై అగ్రరాజ్యం అమెరికాలో కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్‌ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాజీ చీఫ్‌ అలెక్స్‌ జూ, లాస్‌ ఏంజిల్స్‌ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈవో కెవిన్‌ మేయర్‌కి బాధ్యతలను అప్పగించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios