జాతీయ భద్రతకు ముప్పు కారణంగా చైనా యాజమాన్యంలోని ప్రముఖ యాప్‌ టిక్‌టాక్ డౌన్‌లోడ్ నిషేధం పై  ట్రంప్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.   చైనా యాప్ టిక్‌టాక్‌  డౌన్‌లోడ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు ఫెడరల్ న్యాయమూర్తి తాత్కాలికంగా బ్రేకులు వేశారు.

ఆదివారం ఉదయం జరిగిన విచారణ తరువాత యు.ఎస్. ఫెడరల్ న్యాయమూర్తి కార్ల్ నికోలస్ వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్‌  కొత్త డౌన్‌లోడ్‌లపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రాథమిక ఉత్తర్వులను మంజూరు చేశారు, రాత్రి 11:59 గంటలకు ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తుందని తెలిపారు.

యాపిల్, గూగుల్ సోర్లలో నిషేధం అమల్లోకి రాకుండా నిరోధిస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జిల్లా జడ్జి కార్ల్ నికోలస్ వెల్లడించారు. యూ‌ఎస్ లో టిక్‌టాక్‌  యాప్ ఉపయోగాన్ని మరింత అరికట్టడానికి నవంబర్ 12 నుండి అమల్లోకి రానున్న ఇతర వాణిజ్య శాఖ ఆంక్షలను నిరోధించడానికి న్యాయమూర్తి నిరాకరించారు.

also read కరోనా హాట్‌స్పాట్‌లను చూపించే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. ...

భద్రత, గోప్యత ఆందోళన నేపథ్యంలో అమెరికా టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను ట్రంప్ నిషేధం విధించింది. ఇందులో భాగంగా ట్రంప్‌ నిర్ణయంపై వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశాయి. 100 మిలియన్లకు పైగా అమెరికన్లు టిక్‌టాక్‌ యాప్ వాడుతున్నారు.

"మా చట్టపరమైన వాదనలతో కోర్టు అంగీకరించి, టిక్‌టాక్ యాప్ నిషేధాన్ని అమలు చేయకుండా నిరోధించే ఉత్తర్వు జారీ చేసినందుకు మేము సంతోషిస్తున్నాము" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

చైనా యజమన్యంలోని జనాదరణ పొందిన టిక్‌టాక్‌ యాప్ అరికట్టడానికి ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇది రెండవ చట్టపరమైన తీర్పు. చైనా యాజమాన్యంలోని టిక్‌టాక్, వీచాట్ రెండింటిపై నిషేధం విధించాలని గతంలో ట్రంప్ ఆదేశించారు, అమెరికన్ల వ్యక్తిగత డేటాను ఈ యాప్ చైనా ప్రభుత్వానికి చేరవేస్తుందని ఆరోపించారు.