Asianet News TeluguAsianet News Telugu

సామాన్యుడి జేబుకి చిల్లు.. వచ్చే ఏడాది నుండి మరింత పెరగనున్న మీ ఫోన్ బిల్లు..

వోడాఫోన్ ఐడియా ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సుంకాలను 15-20% పెంచాలని చూస్తోంది, ఎందుకంటే టెల్కో నష్టాలను నివారించడానికి, దాని ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. 

This New Year your smart phone bill may go up by 20% in india
Author
Hyderabad, First Published Nov 17, 2020, 1:54 PM IST

 న్యూ ఢీల్లీ: వచ్చే ఏడాది ఉంది మీ ఫోన్ బిల్లు 15-20% పెరగవచ్చు. అవును నిజమే.. వోడాఫో ఐడియా (విఐ), ఎయిర్‌టెల్ వంటి టెలికాం ఆపరేటర్లు సుంకాన్ని పెంచాలని యోచిస్తున్నాయి.

వోడాఫోన్ ఐడియా ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సుంకాలను 15-20% పెంచాలని చూస్తోంది, ఎందుకంటే టెల్కో నష్టాలను నివారించడానికి, దాని ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. దీని బట్టి కస్టమర్లను క్రమంగా కోల్పోయే అవకాశం ఉంది.

భారతి ఎయిర్‌టెల్  కూడా సుంకాన్ని పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తుంది, కాని రిలయన్స్ జియో కదలికలను బట్టి తదనుగుణంగా వారి టారిఫ్ రేట్లను నిర్ణయిస్తారు అని నిపుణులు చెప్పారు. సుంకాలను 25% పెంచడం గురించి అంతర్గత చర్చలు జరుగుతుండగా, ఒకేసారి అమలు చేయడం కష్టమని అన్నారు.

దేశంలోని మూడు ప్రైవేట్ టెల్కోలు గతంలో 2019 డిసెంబరులో రేట్లు పెంచాయి, 2016లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రవేశించిన తరువాత  మొదటిసారి రేట్లు పెంపు శారు. సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి  వోడాఫో ఐడియా ఏ‌ఆర్‌పి‌యూ 119 రూపాయలు, భారతి ఎయిర్‌టెల్ రూ. 162, రిలయన్స్ జియో రూ.145.

also read సోషల్ మీడియాలో వన్‌ప్లస్ ‌9 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌ వైరల్.. లాంచ్, ధర ఎంతంటే.. ...

"ఫ్లోర్ ధర (డేటా రేట్ల కోసం)పై జరుగుతున్న సంప్రదింపులు ఎవరినీ సుంకాల పెంపు నుండి ఆపవు, కానీ సుంకం పెంపు నిర్ణయం ఎంతో దూరంలో లేదని మీకు భరోసా ఇవ్వగలము" అని వోడాఫో ఐడియా ఎం‌డి రవీందర్ తక్కర్ విశ్లేషకులతో అన్నారు.

భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ ధరలను పెంచే మొదటి ఆపరేటర్ కానప్పటికీ, ప్రస్తుత రేట్లు నిలకడగా లేవని అంగీకరిస్తున్నందున,  ఇతర టెల్కోలను  ఎయిర్‌టెల్ అనుసరిస్తుంది అని అన్నారు.

ఏది ఏమయినప్పటికీ జియో దీనిని అనుసరిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో  ఎయిర్‌టెల్ 14 మిలియన్ల కస్టమర్లను, జియో 7 మిలియన్ల మంది కస్టమర్లను చేర్చింది. వి‌ఐ 8 మిలియన్ల వినియోగదారులను కోల్పోయింది.

 ప్రత్యర్థులతో పోటీని తగ్గించడానికి, వినియోగదారులను నిలుపుకోవటానికి 4జి నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెట్టడానికి అత్యవసరంగా రేట్లు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు 

"వి‌ఐ టెల్కో ఆర్ధికవ్యవస్థను మెరుగుపరచడానికి,  పెట్టుబడిదారులపై విశ్వాసాన్ని పెంచడానికి రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది" అని ఒక పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. రుణ, ఈక్విటీల కలయిక ద్వారా వోడాఫో ఐడియా టెల్కో రూ .25 వేల కోట్ల వరకు వసూలు చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios