Asianet News TeluguAsianet News Telugu

ఇక కృత్రిమ మేధతో న్యూడ్ సెల్ఫీలకు చెక్

న్యూడ్​ సెల్ఫీలతో వచ్చే ప్రమాదాలకు చెక్​ పెడుతూ సరికొత్త టెక్నాలజీతో జపాన్ కంపెనీ ఓ స్మార్ట్​ ఫోన్​ను అందుబాటులోకి తెచ్చింది. టీనేజర్లు తీసుకునే సెల్ఫీలు అసభ్యకరంగా ఉంటే వెంటనే గుర్తించి డిలీట్​ చేసేయడంతోపాటు తల్లిదండ్రులకు సమాచారం అందజేస్తుందీ స్మార్ట్ ఫోన్.

This Japanese Smartphone Uses AI to Keep Users from Taking Nude Photos
Author
Hyderabad, First Published Feb 25, 2020, 7:35 PM IST

స్మార్ట్​ఫోన్​ కాలం వచ్చాక యువతలో 'న్యూడ్​ సెల్ఫీ' క్రేజ్​ పెరిగిపోయింది. భవిష్యత్ పరిణామాలను లెక్కచేయకుండా టీనేజర్లు ఈ నేకె​డ్​ ఫొటోలు తమ భాగస్వాములకు పంపుతున్నారు. పొరపాటున ఆ ఫోన్​ను పోగొట్టుకుంటే వారి ఫొటోలు ఇంటర్నెట్​లో వైరల్​ అవుతూ వారితోపాటు తల్లిదండ్రులకు ఇబ్బందులు తెస్తోంది.

దీనికి చెక్​ పెడుతూ కృత్రిమ మేధ సాయంతో సరికొత్త స్మార్ట్​ఫోన్​ను తీసుకొచ్చింది జపాన్​ కంపెనీ 'టోన్​ ఈ20'. ఒక న్యూడ్​​ సెల్ఫీ ఆటలు ఇక సాగనివ్వనంటోంది టోన్​ ఈ20. 

స్మార్ట్​ఫోన్​ ప్రొటెక్షన్​ అనే ప్రత్యేక ఫీచర్​తో వస్తోంది. దీని సాయంతో ఫోన్​లో అసభ్యకర ఫొటోలు ఉంటే గుర్తిస్తుంది. టీనేజర్లు తమవి లేదా ఇతరుల న్యూడ్ ఫొటోలను తీయకుండా నియంత్రిస్తుంది.

ఈ 20లో 'టోన్​ కెమెరా' డిఫాల్ట్​గా వస్తుంది. ఇది ఫొటోలను తీస్తుండగానే అసభ్యకర ఫోటోలను గుర్తించి.. ఫోన్​లో సేవ్​ కాకుండానే డిలీట్​ చేస్తుంది. ఈ ఫోన్​ వారి తల్లిదండ్రుల ఫోన్​కు అనుసంధానమై ఉంటుంది. న్యూడ్​ ఫొటోలు తీయగానే వారి తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తుంది.

టీనేజర్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేందుకు టోన్​ ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెస్తోంది. బడ్జెట్​ ఫోన్​ విభాగంలో రానున్న టోన్​ ఈ20లో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 

మీడియాటెక్​ హీలియో పీ22తోపాటు ఎస్​ఓసీ ప్రాసెసర్​, 6.2 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే కలిగి ఉంది. 4జీబీ ర్యామ్​ విత్ 64జీబీ ర్యామ్ స్టోరేజీ సామర్థ్యం గల ఈ ఫోన్‌లో ​మూడు వెనుక కెమెరాలు (12ఎంపీ+13ఎంపీ+2ఎంపీ) ఉన్నాయి. 3,900 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. దీని ధర 19,800 యెన్​లు (రూ.12,750) ఉంటుందని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios