జియోమీట్ యాప్ గురించి మీకు తెలియని విషయాలు...
జూమ్ యాప్ కి పోటీగా ఇండియన్ యాప్ జియోమీట్ లాంఛ్ అయిన మూడు రోజుల్లోనే 10 లక్షలమందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ముఖ్యంగా చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించిన తరువాత జియోమీట్ యాప్ ఇండియాలో మరింత దూసుకెళ్తుంది.
వీడియో కాన్ఫరెన్సింగ్, వీడియో కాలింగ్ యాప్ రిలయన్స్ జియోమీట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. జూమ్ యాప్ కి పోటీగా ఇండియన్ యాప్ జియోమీట్ లాంఛ్ అయిన మూడు రోజుల్లోనే 10 లక్షలమందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ముఖ్యంగా చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించిన తరువాత జియోమీట్ యాప్ ఇండియాలో మరింత దూసుకెళ్తుంది. చైనా యాప్స్ బ్యాన్ తో స్వదేశీ యాప్‌లకు భారీ డిమాండ్ పెరిగింది. జియో మీట్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
720పీ వీడియో క్వాలిటీతో పాటు 100 మంది ఒకేసారి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉండటం జియోమీట్ ప్రత్యేకత. "వినియోగదారుల సమాచారం భద్రంగా ఉంటుంది. మీ గోప్యతకు భంగం వాటిల్లనివ్వం. పూర్తి పారదర్శకతతో పనిచేస్తాం" అని జియా మీట్ వెబ్‌సైట్‌లో తెలిపారు. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా సందేహాలున్నా మీ అభిప్రాయాలను grievance.officer@jio.comకు పంపాల్సిందిగా కోరారు.
మీరు జియోమీట్ యాప్ ఉపయోగించాలని అనుకుంటే, మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు
also read చింగారీ యాప్‌లో కొత్త మార్పులు..ట్విట్టర్ ద్వారా ప్రకటన.. ...
1. మీరు మీ బ్రౌజర్‌లో, ఐఓఎస్, ఆండ్రోయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో జియోమీట్ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు మీ విండోస్ ల్యాప్‌టాప్, మాక్ ల్యాప్‌టాప్‌లలో కూడా జియోమీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2. జియోమీట్ యాప్ ప్రస్తుతం బీటా వర్షన్ లో ఉందని సైట్ పేర్కొంది. మీరు ఈ వీడియో కాలింగ్ యాప్ వాడుతున్నప్పుడు దీనిని టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ యాప్ వాడుతున్నప్పుడు ఎదుర్కొనే అన్ని టెక్నికల్ లేదా ఇతర సమస్యలను కంపెనీ పరిష్కరిస్తుంది.
3. మీరు జియోమీట్ యాప్ వాడుతున్నపుడు వీడియో క్వాలిటి మీరు ఉపయోగిస్తున్న డివైజ్, మీరు వాడే నెట్‌వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. రెండూ బెస్ట్ అయితే మీరు వీడియో కాల్‌లలో పూర్తి హై డెఫినిషన్ 720పి వీడియో క్వాలిటిని పొందగలుగుతారు.
4. ప్రస్తుతం జియోమీట్ లో అన్ని ఉచితం. మీరు ఉచితంగా సుమారు 100 మంది వ్యక్తులతో వీడియో కాల్‌లను చేయవచ్చు. జూమ్ యాప్ లో గ్రూప్ వీడియో కాల్స్, వీడియో కాల్స్ టైం పై కొంత వరకు మాత్రమే ఉచితంగా అందిస్తుంది. కానీ పెయిడ్ కస్టమర్లకు ఉత్తమ ఆఫర్‌లను ఇస్తుంది. జియోమీట్ యాప్ ఇంకా పేమెంట్ పై ఎలాంటి సమాచారాన్ని ప్రకటించలేదు.
5. జూమ్ యాప్ లో ఉన్న అన్ని ఫీచర్లు జియోమీట్ యాప్ లో కూడా ఉన్నాయి.