టెలికాం కంపెనీ  వోడాఫోన్ ఐడియా సోమవారం దాని బ్రాండ్ ని రీబ్రాండ్ చేస్తోందని, వోడాఫోన్ ఐడియా బ్రాండ్లు ఇప్పుడు “వి‌ఐ” గా మారిందని తెలిపారు. వోడాఫోన్ ఐడియా సెల్యులార్ విలీనం అయినప్పటి నుండి సంస్థ వాటి నెట్‌వర్క్‌లు, కస్టమర్లును విలీనం చేయడం పై దృష్టి పెట్టిందని వోడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ సిఇఒ రవీందర్ తక్కర్ తెలిపారు.

సంస్థ రీబ్రాండింగ్ ద్వారా దేశంలోని టెలికాం రంగంలో తీవ్రమైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది. "ఈ రోజు వి‌ఐ (Vi)అనే బ్రాండ్‌ను ప్రదర్శించడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయుల జీవితంలో మరింత  ముందుకు సాగాలని కోరుకుంటున్నాను, ఈ ప్రయాణంలో వి‌ఐ (Vi)  కస్టమర్ అవసరాలను తీర్చడంపై దృష్టి పెడుతుంది,  ”అని మిస్టర్ తక్కర్ అన్నారు.

వి‌ఐ (Vi) అనే పేరు వొడాఫోన్ ఐడియా  పేర్లకు మరింత వివరంగా, వి‌ఐ (Vi) అంటే  'మేము' అనే అర్ధంతో భారతీయ సమాజంలోని సామూహిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది, అని కంపెనీ తెలిపింది.

also read ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే‌ వర్కింగ్ డేస్ ...

వొడాఫోన్ ఆగస్టు 2018 లో ఐడియా సెల్యులార్‌లో విలీనం అయ్యింది. అయితే వోడాఫోన్, ఐడియా రెండూ ఇప్పటి వరకు వేర్వేరు బ్రాండ్ గుర్తింపులను కొనసాగించాయి.

ఎజిఆర్ బకాయిలు చెల్లించడానికి గత వారం సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకు 10 సంవత్సరాల సమయం ఇచ్చిన తరువాత వోడాఫోన్ ఐడియా తన వ్యాపారాలను భారతదేశంలో  ముందంజలో ఉండటానికి ప్రయత్నిస్తుంది.

ప్రభుత్వానికి రావాల్సిన  ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వారాంతాన వొడాఫోన్‌ ఐడియా బోర్డు రూ. 25,000 కోట్ల సమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.  కంపెనీ సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్‌ బకాయిలు చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.