దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి  సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. కొత్త ఆఫర్ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా లభిస్తుంది.

ఎయిర్‌టెల్ గతంలో కూడా ఒక సంవత్సరం పాటు రూ.399  డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ రూ. 401, రూ. 612, రూ.1,208, రూ.2,599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ద్వారా అందించింది. ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియోలో కూడా డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యాక్సెస్‌ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల ద్వారా కూడా లభిస్తుంది.  

కొత్తగా ప్రారంభించిన డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ ఆఫర్ సెలెక్ట్ చేసిన ఎయిర్‌టెల్ కస్టమర్లకు వర్తిస్తుంది. రూ.999 లేదా అంతకంటే ఎక్కువ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పాటు రూ.499 లేదా అంతకంటే ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఎంచుకున్న వారికి అందిస్తూంది.  

also read బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. 1 సంవత్సర వాలిడిటీతో ఫ్రీ కాల్స్, డాటా.. ...

మీకు పైన తెలిపిన ప్లాన్ వాడుతున్నట్లయితే మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఈ  ఆఫర్ కోసం చెక్ చేసుకోవచ్చు. మీరు యాప్ నుండి డిస్కవర్ #airtelThanks విభాగానికి వెళ్లి, ఆపై డిస్నీ + హాట్‌స్టార్ వి‌ఐ‌పి సబ్ స్క్రిప్షన్ ప్రారంభించడానికి డిస్నీ + హాట్‌స్టార్ పై నొక్కండి.

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఆఫర్ పొందిన తర్వాత మీరు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ నేరుగా డిస్నీ + హాట్‌స్టార్ యాప్ నుండి లేదా దాని వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ లాగానే రిలయన్స్ జియో కూడా ఆగస్టులో రూ. 499, రూ.777  ప్రీపెయిడ్ ప్లాన్ లతో ఒక సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ ప్రవేశపెట్టింది.  

డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ నెలకు రూ. 299 లేదా సంవత్సరానికి  రూ. 1,499.  లైవ్ స్పోర్ట్స్, మల్టీప్లెక్స్ సినిమాలు, లేటెస్ట్ అమెరికన్ షోలు, మూవీస్, డిస్నీ + ఒరిజినల్స్, ఎక్స్‌క్లూజివ్ హాట్‌స్టార్ స్పెషల్స్, టీవీ కంటే ముందు స్టార్ మా సీరియల్స్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది.