చైనీస్ మొబైల్ తయారీ సంస్థ టెక్నో మొబైల్  తాజాగా ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానుంది. టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిసెంబర్ 4 నుండి అందుబాటులోకి వస్తుందని ధృవీకరించింది. ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియా, ఫిలిప్పీన్స్‌తో సహా కొన్ని విదేశీ మార్కెట్లలో అందుబాటులో ఉంది.

క్వాడ్ రియర్ కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. టెక్నో పోవా మూడు కలర్ ఆప్షన్స్, సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్ లో అందింస్తుంది. ప్రస్తుతానికి ఇండియలో ఈ ఫోన్ ధరపై ఎటువంటి సమాచారం లేదు.


భారతదేశంలో టెక్నో పోవా ధర
ప్రత్యేకమైన ఫ్లిప్‌కార్ట్ పేజీ ప్రకారం టెక్నో పోవా డిసెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ కానుంది. ప్రస్తుతానికి ఫోన్ లాంచ్ ఈవెంట్ ఉంటుందా, లేదా అనేది అస్పష్టంగా ఉంది.  ఫిలిప్పీన్స్‌లో ఈ ఫోన్ ధర పి‌హెచ్‌పి 6,999 అంటే ఇండియాలో సుమారు రూ .10,800కు లభిస్తుంది.

ఫిలిప్పీన్స్ వేరియంట్‌ ధరకు దగ్గరగా ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు ధర ఉంటుందని ఊహిస్తున్నారు. ఫోన్ లాంచ్ అయిన తరువాత లభ్యత వివరాలు పూర్తిగా స్పష్టమవుతాయని భావిస్తున్నారు. మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్, డాజిల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ రావచ్చు.

also read పబ్-జి మొబైల్ కి పోటీగా త్వరలో ఫౌ-జి గేమ్ లాంచ్: మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ? ...

టెక్నో పోవా ఫిహార్స్ 
టెక్నో పోవా అండ్రాయిడ్ 10లో హాయి ఓఎస్ తో నడుస్తుంది. 6.8-అంగుళాల హెచ్‌డి ప్లస్ (720x1,640 పిక్సెల్స్) డిస్ ప్లే అందించారు, హోల్-పంచ్ కటౌట్‌తో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి80 సోసితో పనిచేస్తుంది. 4 జిబి ర్యామ్‌,  64జిబి  ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా టెక్నో పోవాలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ట్విట్టర్‌లో వెల్లడైన సమాచారం ప్రకారం కెమెరా సెటప్‌లో రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉంటాయి. నాల్గవ కెమెరా  ఏ‌ఐ హెచ్‌డి లెన్స్ ఉంటుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది.

ఫోన్‌ కనెక్టివిటీ ఆప్షన్స్ లో వై-ఫై, ఎల్‌టిఇ, జిపిఎస్, బ్లూటూత్ తో మరిన్నిలేటెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎఫ్‌ఎం రేడియో సపోర్ట్ కూడా ఉంది. ఇంటర్నల్ సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సీమిటి  సెన్సార్, కంపాస్, జి-సెన్సార్ ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. టెక్నో పోవాకు 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్  తో వస్తుంది.