ఐటీ చరిత్రలోనే ఫస్ట్ టైం..లేటెస్ట్ టెక్నాలజీ అందించేందుకు భారీ ఒప్పందం..

వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడానికి ఐటీ దిగ్గజ సంస్థలు టీసీఎస్, ఐబీఎం కలిసి పని చేయనున్నట్లు ప్రకటించాయి. ఇంతకుముందు ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
 

TCS collaborates with IBM for enterprise transformation

ముంబై: ఐటీ రంగ చరిత్రలో సంచలన కలయికకు దిగ్గజ కంపెనీలు వేదికయ్యాయి. తొలిసారిగా ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఐబీఎం కలిసి పని చేయనున్నాయి.  తమ క్లయింట్‌లకు మెరుగైన సేవలు అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్‌లకు అత్యాధునిక టెక్నాలజీని అందించేందుకు ఐబీఎమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీసీఎస్‌ తెలిపింది.

అత్యుత్తమ టెక్నాలజీతో ఐబీఎం క్లౌడ్‌ యూనిట్‌ను టీసీఎస్‌ ప్రారంభించనుంది. ఇందులో రెండు కంపెనీలు(టీసీఎస్‌, ఐబీఎమ్‌)లకు చెందిన అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఇందులో సేవలు అందిస్తారు.

అయితే డేటా ఎస్టేట్‌ , వివిధ రకాల అప్లికేషన్స్‌ తదితర అంశాలను బదిలీ చేయనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. ఇరు కంపెనీలు అభివృద్ధి చెందేందుకు మెరుగైన అంశాలు బదిలీ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. 

ఇదివరకు డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా భవిష్యత్‌లోనూ డిజిటల్‌ రంగం సృష్టించే నూతన అప్లికేషన్స్‌ ఆధునీకరణ, క్లౌడ్ కంప్యూటింగ్‌ తదితర అంశాలలో ముందుంటామని టీసీఎస్‌ ఉన్నతాధికారి వెంకట్రామన్ తెలిపారు.

టీసీఎస్‌ ఉన్నతాధికారి వెంకట్రామన్ స్పందస్తూ.. భవిష్యత్తులో క్లయింట్లు, వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు టీసీఎస్‌, ఐబీఎం ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కాగా  క్లౌడ్‌ టెక్నాలజీ బదిలీ వల్ల క్లయింట్లకు వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవకాశముంటుందని ఐబీఎం‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బోబ్‌ లార్డ్‌ పేర్కొన్నారు. 

టీసీఎస్,‌ ఐబీఎమ్‌ ఒప్పందంతో ఐటీ వేగంగా వృద్ధి చెందుతుందని లార్డ్‌ అభిప్రాయపడ్డారు. క్లయింట్లకు, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు టీసీఎస్‌, ఐబీఎం కలయిక ఉపయోగపడుతుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

also read పబ్ జి మొబైల్ గేమ్ చైనా దేశానిదా..? అక్కడ ఎందుకు బ్యాన్ చేశారు... ...  

నిరుద్యోగులకు ఐబీఎమ్‌ గుడ్‌న్యూస్‌
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం సృష్టిస్తున్న వేళలో  టెక్‌ దిగ్గజం ఐబీఎమ్‌ నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐబీఎమ్‌ వెబ్‌సైట్‌ లింకిడ్‌ ఇన్‌ పేజీలో 500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఐబీఎంలో 3.50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అందులో మూడో వంతు భారత్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఐబీఎమ్‌ తన మాతృదేశమైన (అమెరికా)లో 400 ఉద్యోగులను నియమించునున్నట్లు తెలిపింది. ఐబీఎమ్‌ కంపెనీ ఇండియాలో కంటే తక్కువ నియామకాలు  చేపట్టడం పట్ల అమెరికాకు చెందిన నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐబీఎమ్‌లో మేనేజర్లు, మిడిల్‌వేర్‌ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం), డేటా సైంటిస్ట్‌లు, నెట్‌వర్క్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌లు తదితర కేటగిరీలలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ఐబీఎమ్‌ ప్రకటించింది. 

ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి బోర్‌గియస్‌ స్పందిస్తూ.. ఐబీఎమ్‌ లాంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లోని ఐటీ నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, యూఎస్‌, యూరప్‌లో వారికి ఐటీ నిపుణుల కొరత వేదిస్తుందని తెలిపారు. మరోవైపు కంపెనీలు ఖర్చులు తగ్గించడానికి దేశీయ ఐటీ నిపుణులు వైపు ఆలోచిస్తున్నట్లు బోర్‌గియస్ పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios