భారతదేశంలో శాటిలైట్ లైవ్  సర్వీస్ ప్రొవైడర్ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. ఇందుకోసం టాటా స్కై కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను విడుదల చేసింది. దేశంలో ఇంటర్నెట్ సేవల కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నంలో ఇప్పుడు నెలకు 500జి‌బి డేటాతో 300 ఎం‌బి‌పి‌ఎస్ స్పీడ్ గల ప్లాన్లను అందిస్తోంది.

ఈ కొత్త ప్లాన్ 500జి‌బి డేటా వరకు 300 ఎం‌బి‌పి‌ఎస్ స్పీడ్ అందిస్తుంది, అయితే 500జి‌బి డేటా ముగిసిన తర్వాత 3 ఎం‌బి‌పి‌ఎస్ కు స్పీడ్ తగ్గుతుంది. కొత్త ప్లాన్ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నెలకు రూ.1,900కు లభిస్తుంది.

ఈ ప్లాన్ ఎంచుకున్న వారికి ఉచిత రౌటర్‌తో పాటు రోల్‌ఓవర్ సౌకర్యం కూడా లభిస్తుంది. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల ప్యాక్‌లను తీసుకుంటున్న వారికి ఉచిత ఇంస్టాలేషన్ కూడా చేస్తున్నారు.

also read చిప్స్ ప్యాకెట్ కొంటె ఫ్రీ ఇంటర్నెట్.. ఎయిర్‌టెల్ వెరైటీ ఆఫర్.. ...

ఈ ప్లాన్ ముంబై, న్యూ ఢీల్లీ, పింప్రి చించ్ వాడ్, పూణే, థానే, బెంగళూరు, చెన్నై, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్, మీరా భయాందర్, నవీ ముంబై ఇంకా నోయిడాలో అందుబాటులో ఉంది.

కంపెనీ అందించే డేటా ప్లాన్‌ల ధరలు రూ .950 నుంచి రూ. 1,900 మధ్య ఉన్నాయి. 25 ఎం‌బి‌పి‌ఎస్ , 50 ఎం‌బి‌పి‌ఎస్, 100 ఎం‌బి‌పి‌ఎస్, 300 ఎం‌బి‌పి‌ఎస్ స్పీడ్‌తో పాటు అన్ని ప్లాన్‌లలో ఆన్ లీనిటెడ్ డేటాను అందిస్తోంది.

ప్రస్తుతం కంపెనీ  ఒక నెల నుంచి 12 నెలల ప్లాన్లను అందిస్తుంది. ఒక నెల ప్లాన్ కాకుండా  మిగతా అన్ని ప్లాన్‌లకు ఉచిత ఇన్‌స్టాలేషన్, ఉచిత రౌటర్ లభిస్తుంది. 12 నెలల ప్లాన్ ధరలు రూ. 9,180, రూ .10,200, రూ. 11,220, రూ. 18,360. ఆరు నెలల ప్లాన్ ధరలు రూ. 4,860, రూ. 5,400, రూ. 5,950. ఎంచుకున్న స్పీడ్ బట్టి ధరలను నిర్ణయించారు.