ఎండాకాలంలో వేసవిని తట్టుకునేందుకు సోని ఒక కొత్త ఉత్పత్తిని లాంచ్ చేసింది. ఎండాకాలంలో ఇంట్లో ఉన్నపుడు ఏ‌సిని పెట్టుకోవచ్చు మరి బయటికి వెళ్ళినపుడు  సూర్యుడి వేడి నుండి కాస్త ఉప్శమానం కోసం సోని కంపెనీ ఓ  చక్కటి పరిష్కారం చూపింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోని  రియాన్ పాకెట్  అని పిలవబడే అతి చిన్న పాకెట్ ఏ‌సిని తీసుకొచ్చింది.

ఇది మొబైల్ ఫోన్ కంటే చిన్నది ఇంకా తేలికైనది కూడా.ప్రత్యేక అండర్ షర్ట్ ఉపయోగించి ఈ చిన్న ఎసి ధరించవచ్చు. రియాన్ పాకెట్ ఏ‌సి బ్యాటరీతో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ కనెక్షన్ ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ఉన్న బ్యాటరీ రెండు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 90 నిమిషాల పాటు చల్లని గాలి ఇస్తుంది.

సాధారణంగా కార్, వైన్ కూలర్లలో ఉపయోగించే ఈ ఎసి కోసం పెల్టియర్ ఎలిమెంట్‌ను ఇందులో ఉపయోగించినట్టు  టోక్యోకు చెందిన సంస్థ పేర్కొంది. సోనీ సంస్థ రియాన్ పాకెట్ ప్రాజెక్ట్ క్రౌడ్ ఫండ్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ద్వారా 28,236,670 యెన్ సమకూర్చాయి, దాదాపు 66,000,000 లక్ష్యంగా పెట్టుకుంది.

also read యూట్యూబ్ సరికొత్త అద్భుతమైన ఫీచర్... రాత్రి సమయాల్లో వారి కోసం.. ...

సోని పోర్టబుల్ ఎసి ధర 14,080 యెన్ అంటే రూ .8,992.61.ఈ ఎయిర్ కండీషనర్ లోపలి దుస్తులపై ధరించటానికి 'S', 'M' ఇంకా 'L' సైజులో ఉంటాయి. కేవలం ఇది పురుషులకు మాత్రమే తయారు చేయబడింది.

దీనికి లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. రియాన్ పాకెట్ ఏ‌సి బ్లూటూత్ 5.0 ఫోన్‌లకు సపోర్ట్ ఇస్తుంది.ఈ ఎసి వాటర్ ప్రూఫ్ కాదు. దీనిపై ఉన్న ధూళి, చెమట, నీటిని హైగ్రోస్కోపిక్ మృదువైన వస్త్రంతో తుడిచివేయవచ్చు.  ఇది ఉత్పత్తి ప్రస్తుతం జపాన్‌లో మాత్రమే లభిస్తుంది.