ఈ కామర్స్ స్నాప్‌డీల్ ‘కమ్ మే దమ్’ దీపావళి సెల్ అక్టోబర్ 16 నుండి ప్రవేశపెత్తనుంది. ఈ సెల్ అక్టోబర్ 20 వరకు ఉంటుంది. కమ్ మే దమ్ సెల్ లో భాగంగా రోజు ఉపయోగపడే  వంట సామాగ్రి, హోమ్ డెకర్ ఇంకా  మరెన్నో గాడ్జెట్లపై తగ్గింపును తెస్తుంది.

స్నాప్‌డీల్ మరింత కస్టమైజేడ్  దీపావళి అనుభవాన్ని అందించాలని చూస్తోంది ఇందుకోసం 92 నగరాల్లో 1.25 లక్షల మందితో వారు ఏమి కొనాలనుకుంటున్నారు అనే దాని పై అడిగి తెలుసుకుంది. స్నాప్‌డీల్ యాప్ ఇప్పుడు హిందీ, తెలుగుతో సహా ఎనిమిది ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది,

ఈ కొత్త లాంగ్వేజ్ ఫీచర్ మెట్రోయేతర నగరాల్లోని వినియోగదారులకు షాపింగ్ చేయడం సులభం చేస్తుంది. ‘కమ్ మే దమ్’ దీపావళి సెల్ కోసం స్నాప్‌డీల్ వినియోగదారులను  తాము కొనాలనుకుంటున్న ఉత్పత్తులను ఎంచుకోవాలని కోరారు.

ఇందులో పాల్గొన్న 1.25 లక్షల మందిలో 42 శాతం మంది రోజువాడే ఉపయోగం కోసం గాడ్జెట్లను ఎంచుకున్నారు. 38 శాతం మంది వినియోగదారులు వంట సామాగ్రిని ఎంచుకున్నారు, తరువాత ఇంటి డెకర్, గిఫ్టింగ్ వస్తువులు, దుస్తులు ఎంచుకున్నట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

also read పెరిగిపోతున్న సెక్స్‌టింగ్: జాగ్రత్త లేదంటే మీ ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యే ఛాన్స్ .. ! ...

స్నాప్‌డీల్  ప్లాట్‌ఫాం గత మూడు నెలల్లో 10వెలకి పైగా అమ్మకందారులను చేర్చింది. స్నాప్‌డీల్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌కు 25 కొత్త కేంద్రాలను జోడించింది. దీపావళి సెల్ కారణంగా రాబోయే వారాల్లో మరిన్ని జోడించాలని యోచిస్తోంది. స్నాప్‌డీల్  ప్లాట్‌ఫాం ఏ వస్తువులపై  ఎంత డిస్కౌంట్ అందిస్తుందో  ఇంకా వెల్లడించలేదు.

హెచ్‌డిఎఫ్‌సి, బ్యాంక్ ఆఫ్ బరోడా, రత్నాకర్ బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్‌తో పాటు పేటిఎం వంటి ఇ-వాలెట్ పేమెంట్ల పై ఆఫర్‌లను అందించనుంది. ఈ యాప్‌లో ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం, పంజాబీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ బాషలలో  అందుబాటులో ఉంది.

స్నాప్‌డీల్ ఇంట్లో స్నాక్స్, సావోర్స్, స్వీట్లు తయారు చేయడానికి స్మార్ట్ సొల్యూషన్స్‌తో కూడిన‘ దీపావళి @ హోమ్ ’రేంజ్ కూడా పరిచయం చేస్తోంది. లైట్లు, డేకర్స్ , ఫ్రాగ్నెంస్, అలంకరణల వాటిపై ప్రత్యేకమైన ఆఫర్ తీసుకు రానుంది.

పండుగ షాపింగ్ అనుభవం కోసం నవరాత్రి, కార్వా చౌత్, ధంతేరాస్ మరెన్నో వాటి కోసం ప్రత్యేకమైన థీమ్ ఇ-స్టోర్లను కూడా కంపెనీ ప్రారంభించనుంది.