భారతదేశంలోని ప్రముఖ సిసిటివి కెమెరా తయారీ సంస్థ సెక్యూర్ఐ 4జి ఎల్‌టి‌ఈ  వైర్‌లెస్ అవుట్ డోర్ రౌటర్ లాంచ్ చేసింది. గత నెలలో కంపెనీ 4జి ఎల్‌టిఇ మిఫీ రౌటర్ ఎస్ -4జిఎంఆర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన నెల రోజుల తరువాత ఇప్పుడు ఈ అవుట్ డోర్ రౌటర్‌ను ప్రవేశపెట్టింది.

ఎస్-4జి డబల్యూఎల్ 4జి ఎల్‌టి‌ఈ అనేది బడ్జెట్ రౌటర్, ఇది గరిష్టంగా 150ఎం‌బి‌పి‌ఎస్ ఇంటర్నెట్  స్పీడ్ అందిస్తుంది. మీడియాటెక్ ఎం‌టి6735డబల్యూ‌ఎం  చిప్‌సెట్ ను ఎస్-4జి డబల్యూఎల్ 4జి ఎల్‌టి‌ఈలో ఉపయోగించారు.

ఈ రౌటర్ పరిధి 20 మీటర్లు. ఈ రౌటర్‌కి  ఒకేసారి 10 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రౌటర్‌ను లాన్ లేదా వైర్‌లెస్ పద్ధతులతో ఏకకాలంలో ఉపయోగించవచ్చు. ఈ రౌటర్‌లో నానో సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉంది.

also read అమెజాన్ మెగా సాలరి డేస్ సేల్.. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, హెడ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై కళ్ళు చెదిరే ...

ఈ 4జి ఎల్‌టిఇ రౌటర్ ప్రత్యేకంగా అవుట్ డోర్ కోసం రూపొందించారు. దీని వల్ల వర్షం పడిన చెడిపోదు. ఈ రౌటర్ ఫ్రీక్వెన్సీ 2.4GHz , దీనికి 12V పవర్ సప్లయి అవసరం ఉంటుంది. ఇది 0-40 డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా పనిచేస్తుంది. ఈ రౌటర్  డౌన్‌లోడ్ స్పీడ్ 150 ఎం‌బి‌పి‌ఎస్, అప్‌లోడ్ స్పీడ్ 50 ఎం‌బి‌పి‌ఎస్. ఈ రౌటర్ ధర రూ.2,999. 

150 ఎం‌బి‌పి‌ఎస్ సి‌పి‌ఈ రౌటర్ ఎల్‌టి‌ఈ సిగ్నల్ యాంప్లిఫికేషన్ సిగ్నల్ కోసం రెండు ఔటర్ సిగ్నల్ యాంటెన్నాలతో వస్తుంది. ఈ రౌటర్ రీసెట్ బటన్‌తో వస్తుంది, ఒకవేళ కరెంట్ హెచ్చుతగ్గులు వంటి కారణాల వల్ల రౌటర్ పనిచేయడం ఆగిపోతే  రిస్టార్ట్ చేయడం సులభం చేస్తుంది.  

సెక్యూర్ఐ ఎస్-4 జిఎంఆర్ మిఫి రౌటర్‌లో 2100 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది, అయితే బ్యాటరీ బ్యాకప్‌కు సంబంధించి కంపెనీ ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. దీనికి 32 జీబీ వరకు మెమరీ కార్డు సపోర్ట్ ఇచ్చింది.