నోయిడాలో శామ్‌సంగ్‌ భారీ పెట్టుబడి.. స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే తయారీపై దృష్టి..

ఎగుమతి-ఆధారిత యూనిట్ (EOU) జనవరి-ఫిబ్రవరి 2021 నాటికి సిద్ధంగా ఉంటుందని, ఏప్రిల్ 2021 నాటికి వాణిజ్య ఉత్పత్తిని సాధిస్తుందని భావిస్తున్నారు.

Samsung to infuse Rs 5,000 crore to expand Noida manufacturing plant in india

దక్షిణ కొరియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ నోయిడాలోని స్మార్ట్‌ఫోన్ డిస్ ప్లే తయారీ కేంద్రంలో సుమారు రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

ఎగుమతి-ఆధారిత యూనిట్ (EOU) జనవరి-ఫిబ్రవరి 2021 నాటికి సిద్ధంగా ఉంటుందని, ఏప్రిల్ 2021 నాటికి వాణిజ్య ఉత్పత్తిని సాధిస్తుందని భావిస్తున్నారు.

"ఇప్పటివరకు గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్లో కంపెనీ 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ ప్లే తయారీ సదుపాయాంతో ప్రపంచంలో మూడవ దేశంగా భారతదేశం అవతరిస్తుంది ”అని యుపి పారిశ్రామిక అభివృద్ధి మంత్రి సతీష్ మహానా అన్నారు.

also read రెడ్‌మి నోట్ 9కి పోటీగా లెనోవా కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు.. త్వరలోనే ఇండియాలో లాంచ్.. ...

చైనాలో కోవిడ్‌-19 తలెత్తాక దేశానికి తరలివచ్చిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1,500 ఉద్యోగాలు సృష్టిస్తుందని భావిస్తున్నారు.

నోయిడాలోని శామ్‌సంగ్ డిస్ ప్లే తయారీ కేంద్రంలో అన్ని రకాల, పరిమాణాల ఎలక్ట్రానిక్ పరికరాల కోసం డిస్ ప్లేల(వీడిభాగాలు, ఉపకరణాలతో సహా) తయారీ, అసెంబ్లింగ్‌, ప్రాసెసింగ్, అమ్మకాల వ్యాపారం కోసం ఏర్పాటు చేయనున్నారు.

అంతకుముందు ఎలక్ట్రానిక్స్ సంస్థ ఇండియన్ యూనిట్ అయిన శామ్‌సంగ్ 3,500 కోట్ల రూపాయల రుణాన్ని శామ్సంగ్ డిస్ ప్లే కేంద్రానికి మంజూరు చేసింది."యుపిలో వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించిన అన్ని ఇతర కంపెనీలు, పెట్టుబడిదారులను మేము అనుసరిస్తున్నాము" అని మహానా చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios