Asianet News TeluguAsianet News Telugu

మనుషుల్లాగే మాట్లాడే డిజిటల్​ మనుషులు... శామ్‌సంగ్ ల్యాబ్స్ సృష్టి

ఎలక్ట్రానిక్​ దిగ్గజం శామ్‌సంగ్​ మనుషుల్లా మాట్లాడే కృత్రిమ డిజిటల్ మానవులను '2020 కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో'లో ప్రదర్శించింది. దీంతో శామ్‌సంగ్​ 'నియాన్​' అనే పేరుతో దాన్ని ఆవిష్కరించింది​.
 

samsung neons artificial humans look like super realistic video chat
Author
Hyderabad, First Published Jan 8, 2020, 12:17 PM IST

శామ్‌సంగ్‌ ల్యాబ్స్‌ 'నియాన్‌' పేరుతో సరికొత్త ఆవిష్కరణను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫక్తు మనుషుల్లాగే మాట్లాడగలిగే కృత్రిమ మానవులను సృష్టించింది శామ్‌సంగ్. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాయంతో ఈ డిజిటల్‌ రూపాలు సంభాషిస్తాయని, సాటివారిపై సానుభూతినీ చూపగలవని కంపెనీ పేర్కొంది.

లాస్‌ వేగాస్‌లో '2020 కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో' ప్రారంభం సందర్భంగా శామ్‌సంగ్‌ యూనిట్‌ స్టార్‌ ల్యాబ్స్‌లో ఉత్పత్తి చేసిన నియాన్‌ వివరాలు వెల్లడించింది. అయితే, కొంత మంది పరిశ్రమ నిపుణులు మాత్రం 'నియాన్‌'లో అంతర్లీనంగా వాడిన టెక్నాలజీపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. 

also read అమెజాన్ నుండి కొత్త ఎకో డివైజ్... కారులో ప్రయాణించేటప్పుడు....

'నియాన్‌'లో చెప్పుకోదగిన రహస్యం ఏమీ లేదు. ఇది కూడా 'ఏఐ'తో రూపొందిన ఒక డిజిటల్‌ అవతారమే. మాకు తెలిసినంత వరకు ఇది వరకే ఉన్న కృత్రిమ మనిషి 'సిరి'లానే ఇది కూడా ఉంది. మీరు వెతుకుతున్న కృత్రిమ మానవులు ఇవి కాదని టెక్ వార్త వెబ్ సైట్ వెర్జ్ పేర్కొంది. 

samsung neons artificial humans look like super realistic video chat

నియాన్లు మన స్నేహితులు, సహచరులు. ఇవి నిరంతరం నేర్చుకుంటూ ఉంటాయి. వాటి పరస్పర చర్యల వల్ల జ్ఞాపకాలు ఏర్పడటమే కాక పదిలం అవుతుంటాయని ల్యాబ్స్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ప్రణవ్‌ మిస్త్రీ తెలిపారు. న్యూరల్‌ నెట్‌వర్క్‌లు, కంప్యుటేషనల్‌ రియాల్టీతో కూడిన అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో నియాన్లను సృష్టించామని వాటి సృష్టికర్తలు చెబుతున్నారు.

ఈ ప్రయోగశాలను 2019లో శామ్‌సంగ్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, శాంసంగ్‌ మొబైల్‌ ఇన్నోవేషన్‌ విభాగాధ్యక్షుడు ప్రణవ్ మిస్త్రీ ఆవిష్కరించారు. ఆయన భారత్‌లో జన్మించారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా)లలో ప్రాజెక్టులు చేశారు. సంజ్ఞల ఆధారంగా పనిచేసే ఉపకరణాల్లో వినియోగించే సిక్త్స్​ సెన్స్‌ అభివృద్ధిలో ఆయనకు ప్రాచుర్యం ఉంది. మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.

also read  పాకెట్‌లో సరిపోయే వైర్ లెస్ బ్లూటూత్ స్పీకర్...ధర కూడా తక్కువే... 

టీవీ ప్రయోక్తలు, సినిమా నటులు, అధికార ప్రతినిధుల వంటి వారిని డిజిటల్‌ రూపంలో సృష్టించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని శామ్‌సంగ్‌ తెలిపింది. మానవ భావోద్వేగాలు (ఎమోషన్స్‌) కూడా వీటికి నిక్షిప్తం చేయొచ్చని సంస్థ పేర్కొంది. ప్రతి నియాన్‌ ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి తనదైన హావభావాలు, కదలికలతో సంభాషణలు పలకగలదని తెలిపింది. వినియోగదారు సేవా కేంద్రాలు, వినోద రంగాల్లో ఎక్కువగా వినియోగించుకోవచ్చని ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios