కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ ఒక కొత్త ప్రత్యేకమైన ఎయిర్‌డ్రెస్సర్‌ను ప్రవేశపెట్టింది, ఇది దుస్తులు సంరక్షణ కోసం ఉపయోగపడే స్మార్ట్ సొల్యూషన్.

సామ్‌సంగ్ నుండి వచ్చిన ఈ క్రొత్త ఆవిష్కరణ బట్టల నుండి దుమ్ము, కాలుష్యం, సూక్ష్మక్రిములను తొలగించడానికి, వాటిని కొత్తగా కనిపించేలా చేయడానికి అంతేకాకుండా  బట్టలపై అంటువ్యాధులను తొలగించడానికి బలమైన గాలి, ఆవిరిని ఉపయోగిస్తుంది, తద్వారా మీ బట్టలను ఇంట్లో, కార్యాలయంలో ఉత్తమంగా చూసుకోవచ్చు.

ఎయిర్‌డ్రెస్సర్‌లోని జెట్‌టైమ్ బట్టలను శుభ్రపరుస్తుంది అలాగే ఇన్ఫ్లుఎంజా, అడెనోవైరస్, హెర్పెస్ వైరస్లతో సహా 99.9 శాతం వైరస్లు, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఈ సామ్‌సంగ్ ఎయిర్‌డ్రెస్సర్‌ను కార్పొరేట్ బెడ్‌రూమ్‌లు, విఐపి లాంజ్‌లు, క్లబ్బులు, హోటళ్ళు మొదలైన ప్రదేశాలలో సౌకర్యవంతంగా ఉపయోగించుకొవచ్చు.  

 సామ్‌సంగ్ ఇండియా, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ మాట్లాడుతూ, "వినియోగదారుల అవసరాల గురించి లోతైన ఆలోచనతో ఇంట్లో బట్టల సంరక్షణ కోసం  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎయిర్‌డ్రెసర్ ను అభివృద్ధి చేశారు.

వాషింగ్ మెషీన్లు, డ్రైయర్‌ల మాదిరిగా ఇది కూడా అవసరమైన గృహోపకరణంగా మారుతుందని మాకు నమ్మకం ఉంది.' అని అన్నారు.

సామ్‌సంగ్ ఎయిర్ డ్రెసర్ ఈ విధంగా బట్టలు శుభ్రపరుస్తుంది 

also read షియోమి ఎం‌ఐ 10 సిరీస్ లో కొత్త 5జి స్మార్ట్ ఫోన్.. జనవరిలో లాంచ్ డేట్ ఫిక్స్.. ...

జెట్‌టైమ్ - జెట్‌స్టైమ్ 99.9 శాతం వైరస్లు, బ్యాక్టీరియా, 100 శాతం కీటకాలు, 99 శాతం దుర్వాసన, 99 శాతం ఇతర హానికరమైన వాటిని తొలగించి, వేడి ఆవిరిని బట్టలలోకి లోతుగా పంపడం ద్వారా దుస్తులను శుభ్రపరుస్తుంది .  

హీట్‌పంప్ డ్రాయింగ్ - హీట్‌పంప్ డ్రాయింగ్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద బట్టలను ఆరబెట్టింది.

డియోడరైజింగ్ ఫిల్టర్లు - డియోడరైజింగ్ ఫిల్టర్లు చెమట, పొగాకు వంటి దుస్తులపై ఉన్న వాసన కణాలను సంగ్రహిస్తాయి తొలగిస్తాయి. తద్వారా దుస్తులు ఎల్లప్పుడూ వాసన లేకుండా చేస్తుంది.

సెల్ఫ్ క్లీన్ - ఈ టెక్నిక్ మీ స్మార్ట్ ఎయిర్‌డ్రెస్సర్ లోపల తేమను తొలగించి, శుభ్రపరచి, వాసన లేకుండా చేస్తుంది, తద్వారా మీ బట్టలు తాజాగా ఉంటాయి.  


ధర మరియు లభ్యత

ఈ సామ్‌సంగ్ ఎయిర్‌డ్రెసర్ ధర రూ .1,10,000. సామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, ఇ-కామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్లలో 24 డిసెంబర్ 2020 నుండి లభిస్తుంది. వినియోగదారులు రూ .10వెల డిస్కౌంట్ తో రూ .5,555 (18 నెలలకు) నో-కాస్ట్ ఇఎంఐ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ 15 రోజులు మాత్రమే ఉంటుంది.