Asianet News TeluguAsianet News Telugu

రోపోసో యాప్ సరికొత్త రికార్డు.. గూగుల్ ప్లే స్టోర్‌లో 10 కోట్లు దాటిన డౌన్ లోడ్లు..

 రోపోసో గూగుల్ ప్లే స్టోర్‌లో 10 కోట్ల డౌన్ లోడ్ మార్కును దాటిందని ప్రకటించింది. ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ షార్ట్ వీడియో యాప్ ఇదేనని కంపెనీ తెలిపింది. 

Roposo app crosses 10 crores  mark on Google Play Store-sak
Author
Hyderabad, First Published Oct 10, 2020, 5:11 PM IST

షార్ట్ వీడియో షేరింగ్ యాప్ రోపోసో గూగుల్ ప్లే స్టోర్‌లో 10 కోట్ల డౌన్ లోడ్ మార్కును దాటిందని ప్రకటించింది. ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ షార్ట్ వీడియో యాప్ ఇదేనని కంపెనీ తెలిపింది.

రోపోసో మాట్లాడుతూ, తాజా అభివృద్ధి రోపోసో కలిగి ఉన్న గ్లాన్స్ సంస్థకు మరో ప్రధాన మైలురాయి. ఇప్పుడు  రోపోసో  మేడ్ ఇన్ ఇండియా యాప్  భారతదేశంలోని 40% స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను చేరుకుందని కంపెనీ తెలిపింది.

100 మిలియన్ల వినియోగదారులను దాటిన మొదటి భారతీయ షార్ట్ వీడియో యాప్ కావడం మాకు గర్వకారణం.రోపోసో పట్ల భారతీయ వినియోగదారులకు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్న విపరీతమైన ప్రేమను తెలుపుతుంది.

also read పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎలాంటి ఖర్చు లేకుండా జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌లోకి మారవచ్చు.....

ఈ విజయాన్ని యు.ఎస్, చైనాతో పాటు భారతదేశాన్ని ఒక ప్రధాన డిజిటల్ హబ్‌గా స్థాపించడంలో సహాయపడాలని మేము ఆశిస్తున్నాము ”అని ఇన్ మొబి గ్రూప్ వ్యవస్థాపకుడు, సిఇఒ నవీన్ తివారీ అన్నారు.

రోపోసో గురించి మీకు సంక్షిప్త సమాచారం ఇస్తూ గురుగ్రామ్ ఆధారిత షార్ట్-వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ రోపోసో  12 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. అలాగే రోజుకు 2 బిలియన్లకు పైగా వీడియో వ్యూస్ వస్తున్నాయి.

బైట్‌డాన్స్ యాజమాన్యంలోని షార్ట్-వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను ప్రభుత్వం నిషేధించిన రెండు రోజుల్లోనే 22 మిలియన్ల మంది కస్టమర్లను తమ యూజర్ బేస్ లో చేర్చుకున్నట్లు కంపెనీ జూలైలో తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios