న్యూ ఢీల్లీ: జూన్ నెలలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సెకనుకు ఆవరేజీగా 16.5 మెగాబైట్ల (ఎంబిపిఎస్) డౌన్‌లోడ్ స్పీడుతో 4జి స్పీడ్ చార్టులో అగ్రస్థానంలో నిలిచింది. వొడాఫోన్- ఐడియా మాత్రం అప్‌లోడ్ స్పీడ్ విషయంలో ముందున్నాయని ట్రాయ్ డేటా తెలిపింది.

ఐడియా టెలికాం 8 ఎమ్‌బిపిఎస్ స్పీడుతో డౌన్‌లోడ్ స్పీడ్ చార్టులో జియో తరువాత నిలిచింది. ట్రాయ్ మైస్పీడ్ పోర్టల్‌లో చూపించిన తాజా డేటా ప్రకారం ఈ వివరాలు వెళ్లడయ్యాయి.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జూన్ నెలలో 4జి నెట్‌వర్క్ వోడాఫోన్ 7.5 ఎమ్‌బిపిఎస్, భారతి ఎయిర్‌టెల్‌  7.2 ఎమ్‌బిపిఎస్ ఆవరేజ్ గా డౌన్‌లోడ్ స్పీడ్ నమోదు చేసింది.

also read ఆపిల్ ఐఫోన్స్ పై ఇప్పుడు 'మేడ్ ఇన్ ఇండియా'.. ...

అప్‌లోడ్ స్పీడ్ లో వోడాఫోన్, ఐడియా ఒక్కొక్కటి 6.2 ఎమ్‌బిపిఎస్ స్పీడుతో  ముందున్నయి. జియో, ఎయిర్‌టెల్ మాత్రం ఆవరేజీగా అప్‌లోడ్ స్పీడ్ 3.4 ఎమ్‌బిపిఎస్ నమోదైంది. డౌన్‌లోడ్ స్పీడ్ ఇతరులు పంపిన మెసేజెస్, ఫోటోలు, వీడియోలు మొదలైనవాటిని వేగంగా డౌన్ లోడ్ అవడానికి సహాయపడుతుంది.

అయితే అప్‌లోడ్ స్పీడ్ మాత్రం యూసర్లు ఇతరులకు పంపించే మెసేజెస్, ఫోటోలు, వీడియోలు పంపించడంలో సహాయపడుతుంది. వొడాఫోన్, ఐడియా వారి మొబైల్ వ్యాపారాన్ని విలీనం చేసిన సంగతి తెలిసిందే, అయితే కంపెనీలు మాత్రం తమ 4జి స్పీడ్ వివరాలను విడిగా రిపోర్ట్ చేస్తూన్నాయి.

మార్చి-ఏప్రిల్ నెలలో టెలికాం ఆపరేటర్ల నెట్‌వర్క్‌ల డేటా స్పీడ్ కనిష్ట స్థాయికి పడిపోయిన తరువాత  జూన్‌లో మళ్ళీ పెరిగింది. లాక్ డౌన్ సమయంలో జియో డౌన్‌లోడ్ స్పీడ్ 13.3 ఎమ్‌బిపిఎస్, వోడాఫోన్ 5.6 ఎమ్‌బిపిఎస్, ఎయిర్‌టెల్‌  5.5 ఎమ్‌బిపిఎస్, ఐడియా 5.1 ఎమ్‌బిపిఎస్‌లకు పడిపోయింది.