రిలయన్స్ జియో వాడుతున్నారా..అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.1 తేడా కానీ ఎన్నో ప్రయోజనలు..
జియోలో చాలా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఐపిఎల్ 2020 సీజన్ కావడంతో క్రికెట్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని అదనపు ప్రయోజనాలను జోడించి ఒక కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.

టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చాలా తక్కువ సమయంలో మార్కెట్లో పట్టును సాధించింది. జియోలో చాలా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఐపిఎల్ 2020 సీజన్ కావడంతో క్రికెట్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని అదనపు ప్రయోజనాలను జోడించి ఒక కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.
రూ.598 ప్లాన్, రూ.599 రీఛార్జ్ ప్లాన్ మధ్య ఒక్క రూపాయి మాత్రమే తేడా. మీరు జియో ప్రీపెయిడ్ యూజర్ అయితే రూ.598 ప్లాన్, రూ.599 రీఛార్జ్ ప్లాన్‌ల మధ్య తేడా ఏమిటో తెలుసుకోండి..
రిలయన్స్ జియో రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్: రిలయన్స్ జియో ప్లాన్‌తో ప్రతిరోజూ 2 జిబి హై-స్పీడ్ డేటాను రూ.598కే అందిస్తున్నారు. డేటా లిమిట్ అయిపోయినప్పుడు స్పీడ్ 64కేబిపిఎస్ కి పడిపోతుంది.
డేటా కాకుండా జియో నుండి జియో ఆన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 2వేల నిమిషాలు పొందుతారు. ఈ ప్లాన్ లో రోజుకు 100 ఎస్ఎంఎస్ ల సౌకర్యం కూడా ఉంది.
also read బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. 1 సంవత్సర వాలిడిటీతో ఫ్రీ కాల్స్, డాటా.. ...
వాలిడిటీ, ఇతర ప్రయోజనాలు
ఐపిఎల్ 2020 మ్యాచ్‌లను చూడటానికి వినియోగదారులకు ఈ ప్లాన్ తో డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ఉచిత సభ్యత్వం కూడా లభిస్తుంది. అలాగే జియో సినిమాతో సహా ఇతర జియో యాప్‌లకు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ జియో ప్లాన్ 56 రోజుల వాలిడిటీ ఉంటుంది, అంటే ఈ ప్లాన్‌లో మొత్తం 112 జిబి డేటా వస్తుంది.
రిలయన్స్ జియో రూ.599 ప్లాన్
రూ.599 ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్‌తో మీకు రోజుకు 2 జిబి డేటా లభిస్తుంది అంటే ఈ ప్లాన్‌లో మీకు మొత్తం 168 జిబి డేటా లభిస్తుంది. జియో నుండి జియోకి ఆన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకి 3వేల నిమిషాలు కాల్స్ అందిస్తుంది.
అలాగే, రోజూ 100 ఎస్ఎంఎస్ ల సౌకర్యం కూడా ఉంది. మీరు జియో సినిమాతో సహా ఇతర జియో యాప్స్ కి ఉచిత అక్సెస్ పొందుతారు.
జియో రూ.598, రూ.599 రూపాయల ప్లాన్‌ల మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే : కేవలం 1 రూపాయి ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా, మీకు 28 రోజుల అదనపు వాలిడిటీతో 1000 నిమిషాల కాల్స్ అదనంగా లభిస్తుంది, అయితే రూ.598 ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపికి ఒక సంవత్సరం ఉచితం అక్సెస్ లభిస్తుంది.

