క్రికెట్ లవర్స్ కోసం ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో క్రికెట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. జియో క్రికెట్ ప్లాన్ తో ప్రతి మ్యాచ్ అంతరాయం లేకుండా లైవ్ లో చూడవచ్చుఅని తెలిపింది. సదరణంగా లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఎక్కువ డాటా అవసరముంటుంది.

ఒకోసారి లైవ్ మ్యాచ్ చూస్తున్నపుడు డాటా సమస్యలు ఎరురావుతుంటాయి. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి జియో ధన్ ధనా ధన్ క్రికెట్ ప్లాన్ తీసుకొచ్చింది.

జియో ప్రిపెయిడ్ యూజర్లు డిస్నీ + హాట్ స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్ పొందటానికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరానికి రూ.399 చెల్లిస్తే సరిపోతుంది.  డిస్నీ + హాట్‌స్టార్ విఐపి  ఎక్స్ క్లుసివ్ హాట్‌స్టార్ స్పెషల్స్, అన్‌లిమిటెడ్ లైవ్ స్పోర్టింగ్ యాక్షన్, లేటెస్ట్ బాలీవుడ్, సూపర్‌హీరో మూవీస్ ఇంకా మరెన్నో  అందిస్తుంది. 

also read అమెజాన్ పే కొత్త సర్వీస్.. కేవలం రూ.5 బంగారాన్ని కొనొచ్చు.. ...

 కొత్త  క్రికెట్ ప్యాక్‌ వివరాలు

రూ.499 క్రికెట్ ప్యాక్(యాడ్ ఆన్ డాటా): ఈ రూ.499 క్రికెట్ ప్యాక్ ఆన్ లిమిటెడ్ క్రికెట్ కవరేజీతో రూ.399 విలువైన డిస్నీ + హాట్ స్టార్ 1 సంవత్సర సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్యాక్ క్రికెట్ సీజన్ (56 రోజులు) మొత్తం కాలానికి 1.5 జి‌బి డేటాను కూడా అందిస్తుంది.

రూ.777 3 నెలల ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసే వినియోగదారులకు 399 రూపాయల విలువైన డిస్నీ + హాట్‌స్టార్ విఐపి 1-సంవత్సర సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్ తో పాటు 131 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 84 రోజుల వాలిడిటీతో జియో యాప్‌లకు అక్సెస్ అందిస్తుంది.