జియో కస్టమర్లకు గుడ్ న్యూస్...ఇక ప్రతి రీచార్జీ పై క్యాష్ బ్యాక్...

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మాదిరిగానే రిలయన్స్ జియో కూడా తన కస్టమర్లకు కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఇతర జియో కస్టమర్లకు రీచార్జీ చేస్తే రూ.4.16 శాతం క్యాష్ బ్యాక్ అవుతుంది.  

Reliance Jio launches JioPOS Lite app, users can earn commission for every Jio recharge, get details

ముంబై: ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్‌ జియో తన వినియోగ దారులకు మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘జియో పీఓఎస్‌ లైట్‌ ’ పేరిట తెచ్చిన ఈ యాప్ ద్వారా ఇతరులకు రీఛార్జీ  చేయవచ్చు. తద్వారా రీఛార్జి చేసిన ప్రతిసారీ కమిషన్‌ పొందొచ్చు. వినియోగదారులు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాదు.. ఈ యాప్‌ ద్వారా వినియోగదారుడు ఇతర జియో నంబర్లకు రీఛార్జ్‌ చేసిన మొత్తంపై 4.16 శాతం కమీషన్‌గా పొందవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ముందుగా కాంటాక్ట్స్‌, ప్రాంతం, మీడియాకు సంబంధించిన వివరాలతో యాక్సెస్‌ కావడం ద్వారా యాప్‌లో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. దీనికి ఫిజికల్ వెరిఫికేషన్ గానీ, ధ్రువీకరణ పత్రాలు గానీ అవసరం లేదు. ఐఫోన్లకు ఈ యాప్ ఉపయోగపడుతుందా? లేదా? అన్న సంగతి వెల్లడి కాలేదు. 

ముందుగా రూ.500, రూ.1000, రూ.2000 క్యాష్‌ను వినియోగ దారులు తమ వ్యాలెట్‌లోకి బదిలీ చేసుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్లను ఉపయోగించి ఇతరులకు రీఛార్జి చేయొచ్చు.

also read వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ...ఆ బటన్ నొక్కితే ఒకేసారి వీడియో కాలింగ్​...

యాప్‌లో పాస్‌బుక్‌ ఫీచర్‌ ద్వారా 20 రోజులకోసారి నగదు లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రీఛార్జి చేయడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ఈ యాప్‌ ఉపకరిస్తుంది. ఇప్పటికే తొమ్మిది బ్యాంకుల ఏటీఎంల ద్వారా రీఛార్జి చేసుకునే సౌకర్యాన్ని ఇది వరకే రిలయన్స్ జియో కల్పించింది.

మరోవైపు భారతీ ఎయిర్ టెల్ కూడా ’ఎర్న్ ఫ్రం ఆదాయం’ పేరుతో ఇటువంటి స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ యాప్ ద్వారా ఇతర యూజర్లకు రీచార్జీ చేస్తే నాలుగు శాతం క్యాష్ బ్యాక్ అవుతుంది. 

వొడాఫోన్ ఐడియా సైతం ‘రీచార్జీ ఫర్ గుడ్’ ఇన్షియేటివ్ అనే పేరుతో ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. వొడాఫోన్ యూజర్లు తమ యాప్ ద్వారా ఇతర వొడాఫోన్ ఐడియా యూజర్లకు రీచార్జీ చేస్తే ఆరు శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios