Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ జియో సంచలనం... జూమ్, గూగుల్ మీట్‌కి పోటీగా కొత్త యాప్

జియో మీట్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని,ఇది ఏ డివైజ్ లో అయిన, ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ లోనైనా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ వెల్లడించారు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లలో యాక్సెస్ చేయొచ్చు. 

Reliance Jio is all set to launch a new video conferencing app called JioMeet
Author
Hyderabad, First Published May 1, 2020, 6:03 PM IST

జూమ్, గూగుల్ మీట్‌ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లకు  గట్టి పోటీగా రిలయన్స్ జియో కొత్త వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.  కరోనా వైరస్ లాక్ డౌన్  వల్ల ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో దేశంలో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగింది.

ఉద్యోగులు, విద్యార్ధులు జూమ్, గూగుల్ మీట్ యాప్ లను వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఎక్కువగా ఉపయోగించే యాప్‌లు. ఇప్పుడు, జియో వాటికి పోటీగా కొత్త యాప్‌ జియోమీట్ ని ప్రారంభించటానికి యోచిస్తోంది.

త్వరలో ఈ కొత్త వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. ఏప్రిల్ 30 గురువారం రోజున ఈ ప్రకటన చేశారు. 

భద్రతా లోపాల కారణంగా జూమ్ యాప్ వివాదాల్లోకి చిక్కుకున్నప్పటి నుండి, భారతదేశం వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ల పై దృష్టి పెట్టింది. ఇప్పుడు, రిలయన్స్ జియో తన స్వంత వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌తో లాంచ్ చేసింది.

ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో  అత్యవసరంగా మారిన వీడియో-కాన్ఫరెన్సింగ్  సేవలలోకి ప్రవేశించింది. అంతేకాదు ఈ రంగంలో దూసుకుపోతున్న జూమ్, గూగుల్ మీట్,  హౌస్‌పార్టీ  లాంటి యాప్ లకు గట్టి  షాక్ ఇచ్చింది.

జియో మీట్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని,ఇది ఏ డివైజ్ లో అయిన, ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ లోనైనా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ వెల్లడించారు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లలో యాక్సెస్ చేయొచ్చు.

ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్‌ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి జియోమీట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరో ముఖ్య విషయం ఏమిటంటే వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మాత్రమే జియో మీట్ పరిమితం కాదు. జియో ఇ-హెల్త్, ఇ-ఎడ్యుకేషన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో దీన్ని అనుసంధించారు. దీని ద్వారా వినియోగదారులు వర్చ్యువల్ గా వైద్యులను సంప్రదించడానికి, ప్రిస్క్రిప్షన్లను పొందడానికి, మందులను ఆర్డర్లు ఇవ్వడానికి  ఉపయోపడుతుంది.

దీంతోపాటు  డిజిటల్ వెయిటింగ్ రూమ్‌లను ప్రారంభించడానికి వైద్యులకు అనుమతిస్తుంది. ఇంకా వర్చువల్ తరగతి గదులు, రికార్డ్ సెషన్లు, హోంవర్క్‌లు, పరీక్షలను నిర్వహించడం లాంటి వాటికోసం ఇ-ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది. తమ జియో మీట్ బహుళ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేస్తుందనీ, నావిగేట్ చేయడం  కూడా చాలా సులభం కనుక దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చని పవార్ చెప్పారు. 

ఫ్రీప్లాన్‌లో ఐదుగురు  వినియోగదారులు, బిజినెస్‌ ప్లాన్‌లో 100 మంది యూజర్ల వరకు జియో మీట్‌  పాల్గొనే అవకాశాన్ని కల్పించనుంది. జియో వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం గ్రూప్ కాలింగ్‌ ద్వారా ఒకేసారి 100 మంది పాల్గొనే అవకాశం ఉండనుంది. జూమ్ ప్రస్తుతం 40 నిమిషాల వ్యవధిలో 100 మంది పాల్గొనే అవకాశాన్ని ఉచితంగా అందిస్తోంది. 

 కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి(వర్క్ ఫ్రమ్ హోమ్) పనిచేసేందుకు అనుమతినిచ్చాయి. అలాగే విద్యాసంస్థలు కూడా వీడియో-కాన్ఫరెన్సింగ్, ఆన్ లైన్ పాఠాల వైపు మళ్లాయి. దీనితో గూగుల్, మైక్రోసాఫ్ట్ , జూమ్ వంటి సంస్థల వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ కు ఆదరణ భారీగా పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios