కరోనా వైరస్ ఎఫెక్ట్: రిలయన్స్ జియో డబుల్ డేటా ఆఫర్...
రిలయన్స్ జియో ఇప్పుడు రూ .11, రూ .21, రూ .51, రూ .101 రిచార్జ్ వోచర్‌లను డబుల్ డేటాతో సవరించింది.ఎఫ్‌యుపి వాయిస్ నిమిషాలు, డేటా మొదట మీ బేస్ ప్లాన్ నుండి కట్ అవుతుంది.
రిలయన్స్ జియో ఇప్పుడు రూ .11, రూ .21, రూ .51 అలాగే రూ .101 4జి డేటా వోచర్ ఇకనుంచి డబుల్ డేటాతో పాటు అదనపు ఆఫ్-నెట్ నిమిషాలను అందిస్తుంది. కరోన వైరస్ వ్యాప్తి కారణంగా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుండి పని చేయాలని ప్రోత్సహిస్తునందుకు ఈ మార్పులు చేశామని, జియో వినియోగదారుల కనెక్టివిటీ అవసరాలను తీర్చడానికి నిరంతరాయంగా డేటాను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
also read ఒప్పో కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్...
ప్రీపెయిడ్ రూ .11 రిచార్జ్ వోచర్ 4జి డేటా కింద కస్టమర్లకు 800 ఎంబి హై-స్పీడ్ 4జి డేటాతో పాటు జియో కాల్స్ కోసం అదనంగా 75 నిమిషాలు అందిస్తుంది. రూ .21 రిచార్జ్ ప్యాక్‌తో కంపెనీ ఇప్పుడు 2 జీబీ రివైజ్డ్ హై-స్పీడ్ 4జీ డేటాతో పాటు 200 అదనపు ఆఫ్-నెట్ కాలింగ్ నిమిషాలను అందిస్తోంది.
రూ. 51 ప్రీపెయిడ్ రిచార్జ్ 4జి డేటా వోచర్ ఇప్పుడు 6 జిబి హై-స్పీడ్ డేటా, 500 ఆఫ్-నెట్ కాలింగ్ నిమిషాలను అందిస్తుంది. అలాగే రూ .101 రిచార్జ్ ప్లాన్ ఇప్పుడు కస్టమర్లకు 12 జిబి హై స్పీడ్ డేటాతో పాటు 1,000 ఆఫ్-నెట్ నిమిషాలను అందిస్తుంది.
also read బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్...వారికోసం ఫ్రీ డాటా...
మీ బేస్ ప్లాన్ లాగానే వీటి వాలిడిటీలు ఉంటాయి.మీరు మీ డేటాను ఉపయోగించిన తరువాత నెట్ స్పీడ్ 64kbps కు పడిపోతుంది. ఒకవేళ మీరు మీ డాటాని ఉపయోగించకపోతే మీ బేస్ ప్లాన్‌తో పాటు వాటి వాలిడిటీ కూడా ముగుస్తుంది.
జియో వాయిస్ కాల్స్ విషయంలో, మీరు మీ బేస్ ప్లాన్ 4జి డేటా వోచర్ నిమిషాలు రెండు అయిపోతే, మీ బ్యాలెన్స్ నుండి నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తుందని కంపెనీ పేర్కొంది. 4G డేటా వోచర్ పొందడానికి మీరు యాక్టివ్ బేస్ ప్లాన్ వాడుతుండలి.