ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ బుధవారం డిజిటల్ గ్రూప్ ఆర్మ్ జియో స్వదేశీ 5జి టెలికం అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. "జియో మొదటి నుండి పూర్తి 5జి నెట్వర్క్ రూపొందించి, అభివృద్ధి చేసింది.

రిలయన్స్‌ జియోలో గూగుల్ 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు కూడా తెలియజేశారు. గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో 4జీ/5జీ ఫోన్లను తయారు చేనున్నట్లు తెలియజేశారు.

అంతేకాకుండా దేశీ వినియోగం కోసం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించనున్నట్లు వివరించారు. 5జి స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇది ట్రయల్స్‌కు సిద్ధంగా ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్‌కు కూడా సిద్ధంగా ఉంటుంది" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న్యువల్ జెనరల్ మీటింగ్ లో ముకేష్ అంబానీ అన్నారు.

జియో గ్లోబల్-స్కేల్ 4జి, ఫైబర్ నెట్‌వర్క్ అనేక కోర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, కాంపోనెంట్స్‌తో పనిచేస్తుంది. 20కి పైగా స్టార్టప్ భాగస్వాములతో జియో ప్లాట్‌ఫాంలు 4జి, 5జి, క్లౌడ్ కంప్యూటింగ్, డివైజెస్ అండ్ ఓఎస్, బిగ్ డేటా, ఎఐ, ఎఆర్ / విఆర్, బ్లాక్‌చెయిన్, నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, కంప్యూటర్ విజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రపంచ స్థాయి సామర్థ్యాలను నిర్మించాయని ఆయన అన్నారు.

also read చైనా సంస్థలపై వ్యతిరేకత.. 2021 నుంచి ఫోన్ల కొనుగోళ్లపై నిషేధం.. ...

"ఈ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, కొత్త వాణిజ్యం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ తయారీ, స్మార్ట్ మొబిలిటీ వంటి మల్టీ పరిశ్రమల పరిష్కారాలను సృష్టించగలము" అని అన్నారు.

వచ్చే మూడేళ్లలో జియో 500 మీలియన్ మొబైల్ కస్టమర్లు, ఒక బిలియన్ స్మార్ట్ సెన్సార్లు, 50 మిలియన్ల గృహ, వ్యాపార సంస్థలను అనుసంధానిస్తుందని ముకేష్ అంబానీ అన్నారు.

"డిజిటల్ కనెక్టివిటీ వృద్ధికి మేము పూర్తిగా కిక్‌స్టార్ట్ చేసాము మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, జియోఫైబర్, జియో ఎంటర్ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్, ఎస్‌ఎం‌ఈ కోసం బ్రాడ్‌బ్యాండ్, జియో నారోబ్యాండ్ ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్ (NBIoT)" అని ఆయన పేర్కొన్నారు.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వీడియో కాన్ఫెరెన్సింగ్‌ ద్వారా నిర్వహిస్తున్న ఏజీఎంలో ఈ వివరాలు తెలియజేశారు.