Redmi note 11 pro 5g: రెడ్‌మీ నోట్ 11 ప్రో 5G మొబైల్ ధర, ఫీచర్లు ఇవే..!
రెడ్‌మీ నోట్ 11 సిరీస్ (Redmi Note 11 series)ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది షియోమీ. ఈ సిరీస్‌లో మొత్తంగా నాలుగు ఫోన్లు వచ్చేశాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీ (Redmi Note 11 Pro 5G), రెడ్‌మీ నోట్ 11ప్రో (Redmi Note 11 Pro), రెడ్‌మీ నోట్ 11(Redmi Note 11), రెడ్‌మీ నోట్ 11ఎస్(Redmi Note 11S) పేరుతో ఈ సిరీస్ మొబైళ్లు విడుదలయ్యాయి.
రెడ్‌మీ నోట్ 11 సిరీస్ (Redmi Note 11 series)ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది షియోమీ. ఈ సిరీస్‌లో మొత్తంగా నాలుగు ఫోన్లు వచ్చేశాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీ (Redmi Note 11 Pro 5G), రెడ్‌మీ నోట్ 11ప్రో (Redmi Note 11 Pro), రెడ్‌మీ నోట్ 11(Redmi Note 11), రెడ్‌మీ నోట్ 11ఎస్(Redmi Note 11S) పేరుతో ఈ సిరీస్ మొబైళ్లు విడుదలయ్యాయి. అన్ని ఫోన్లు అమోలెడ్ డిస్‌ప్లేతో ఉన్నాయి. నోట్ 11 మినహా మిగిలిన మూడు మొబైళ్లలో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాలు ఉన్నాయి. అలాగే రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌తో పోలిస్తే 11 మొబైళ్లు మంచి అప్‌గ్రేడ్లతో వచ్చాయి. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 11 ప్రో 5జీ ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ మీ నోట్ 11 ప్రో 5జీ (Redmi note 11 pro 5g launched) ఫోన్లో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, హైపర్ ఛార్జింగ్ ఫీచర్లు ప్రధానమైనవి. రెడ్‌మీ 11 ప్రో 5 జీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 330 డాలర్లు (సుమారు రూ.24,600)గా నిర్ణయించింది కంపెనీ. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 380 డాలర్లు (దాదాపు రూ.28,400)గా ఉంచుంది (Redmi note 11 pro 5g Price) షియోమీ.
6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ9 ప్రాసెసర్, 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో వెనుకవైపు నాలుగు కెమెరాలు (108 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ) ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, సైడ్ మౌట్ ఫింగర్ ప్రిట్ ఉన్నాయి.
ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకట విడుదల చేయలేదు. గ్లోబల్ మార్కెట్లో వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభం (Redmi note 11 pro 5g sales) కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సరీస్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేసే అవకాశముందని టెక్ వార్తా సంస్థలు (Redmi note 11 pro 5g in India) అభిప్రాయపడుతున్నాయి.