చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ  షియోమీ త్వరలో రెడ్‌మీ 9 సిరీస్‌ కింద మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయబోతున్నది. రెడ్‌మి 9ఐ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 15 న భారతదేశంలో లాంచ్ కానుంది.

రాబోయే ఫోన్ కొత్త రెడ్‌మి 9, రెడ్‌మి 9ఎ, రెడ్‌మి 9 ప్రైమ్ హ్యాండ్‌సెట్‌లతో పాటు 9 సిరీస్‌లో చేరింది. రెడ్‌మి 9ఐ ఆన్‌లైన్‌ స్టోర్ ఎం‌ఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ సైట్‌లలో లభిస్తుందని షియోమి తెలిపింది.

ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి 9 సిరీస్‌లో ఫోన్లలాగానే వాటర్‌డ్రాప్ స్టయిల్ నాచ్  తో వస్తుంది. MIUI 12 సాఫ్ట్‌వేర్‌ పై పని చేస్తుందని వెల్లడించింది. రెడ్‌మి 9ఐ ఇండియా లాంచ్  గురించి షియోమి సంస్థ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

also read ఫెస్టివల్ సీజన్‌ కోసం 50 వేల కిరాణా స్టోర్లతో జతకట్టిన ఫ్లిప్‌కార్ట్.. ...

రెడ్‌మి 9ఐ ముఖ్యమైన  ఫీచర్స్ గురించి ఎం‌ఐ.కామ్‌ ప్రత్యేక పేజీలో చూపించింది. 3.5 ఎం‌ఎం ఆడియో జాక్ సపోర్ట్‌, స్క్రీన్ కుడి అంచున ఫిజికల్ బటన్లు,  ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్‌ లో వస్తున్నట్లు తెలిపింది.

అయితే లాంచ్ ఈవెంట్‌లో మరిన్ని వేరియంట్‌లు ఆవిష్కరించొచ్చని భావిస్తున్నారు. రెడ్‌మి 9ఐలో కూడా పెద్ద డిస్‌ప్లే, మైక్రో ఎస్‌డి కార్డ్ సపోర్ట్‌ను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ లో గేమింగ్-సెంట్రిక్ ఫీచర్లు, కెమెరాలో ఆప్టిమైజేషన్, పెద్ద బ్యాటరీని అందించవచ్చు  అని ఊహిస్తున్నారు.

ఇది కాకుండా రెడ్‌మి 9ఐ గురించి ఇప్పటికి చాలా తక్కువ సమాచారం ఉంది. రెడ్‌మీ 9 ప్రారంభ ధర రూ.8,999గా ఉంది. రాబోయే కొత్త ఫోన్  రెడ్‌మీ 9, రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9 ప్రైమ్‌ ఫోన్ల లాగానే 9ఐ ధర కూడా 10వేల లోపు ఉండనున్నట్లు తెలుస్తున్నది.