స్టీరియో స్పీకర్లు, 128 జీబీ స్టోరేజ్ తో కొత్త రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే..
కొత్త రెడ్‌మి ఫోన్ ఇతర ముఖ్యమైన ఫీచర్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC, స్టీరియో స్పీకర్లు, 128జిబి వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందిస్తున్నారు. ముఖ్యంగా రెడ్‌మి 9 పవర్ రీబ్యాడ్ చేయబడిన రెడ్‌మి నోట్ 9 4జి ఫోన్, గత నెలలో దీనిని చైనాలో లాంచ్ చేశారు.
షియోమి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 9 పవర్‌ను భారత్‌లో విడుదల చేసింది. కొత్త మోడల్ క్వాడ్ రియర్ కెమెరాలతో, వాటర్‌డ్రాప్ స్టయిల్ డిస్ ప్లే నాచ్‌తో వస్తుంది. రెడ్‌మి 9 పవర్‌లో లేటెస్ట్ MIUI 12 కూడా ఉంది.
కొత్త రెడ్‌మి ఫోన్ ఇతర ముఖ్యమైన ఫీచర్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC, స్టీరియో స్పీకర్లు, 128జిబి వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందిస్తున్నారు. ముఖ్యంగా రెడ్‌మి 9 పవర్ రీబ్యాడ్ చేయబడిన రెడ్‌మి నోట్ 9 4జి ఫోన్, గత నెలలో దీనిని చైనాలో లాంచ్ చేశారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11, వివో వై20, ఒప్పో ఎ53లకు పోటీగా తీసుకొచ్చింది.
భారతదేశంలో రెడ్‌మి 9 పవర్ ధర, లభ్యత వివరాలు
భారతదేశంలో రెడ్‌మి 9 పవర్ ధర 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.10,999 ఉండగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగులో వస్తుంది, బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫైరీ రెడ్, మైటీ బ్లాక్.
ఆన్‌లైన్‌లో అమెజాన్, ఎంఐ.కామ్ తో పాటు ఎంఐ హోమ్స్, ఎంఐ స్టూడియోస్, ఎంఐ స్టోర్స్ ద్వారా ఆఫ్‌లైన్‌లో లభిస్తుంది. రెడ్‌మి 9 పవర్ మొదటి సెల్ డిసెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది.
అయితే రెడ్‌మి నోట్ 9 4జిని చైనాలో బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర సిఎన్‌వై 999 అంటే ఇండియాలో సుమారు రూ. 11,200 ప్రారంభ ధరతో విడుదల చేశారు.
రెడ్‌మి 9 పవర్ స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో) రెడ్‌మి 9 పవర్ ఆండ్రాయిడ్ 10లో MIUI 12తో నడుస్తుంది. 6.53-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ 1,080x2,340 పిక్సెల్‌లు డాట్ డ్రాప్, 400 నిట్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC, అడ్రినో 610 GPU, 4GB LPDDR4X ర్యామ్ తో వస్తుంది.
ఫోటోలు, వీడియోల కోసం రెడ్‌మి 9 పవర్ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా, 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరా ఉంది.