ఆదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ ఎక్స్ సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్స్...

రియల్‌ మీ ఎక్స్ 3 సిరీస్‌లోని రెండు కొత్త మోడళ్లు 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరాలు, డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తాయి. రియల్‌ మీ ఎక్స్ 3 సిరీస్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC తో వస్తుంది. 

Realme X3 and Realme X3 SuperZoom smartphones have been launched in India

 భారత దేశంలోని స్మార్ట్ ఫోన్ దిగ్గజం  రియల్‌ మీ ఎక్స్‌3, రియల్‌ మీ ఎక్స్‌3 సూపర్‌జూమ్‌లను ఎక్స్  సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లుగా భారత్‌లో విడుదల చేశారు. రియల్‌ మీ ఎక్స్ 3 సిరీస్‌లోని రెండు కొత్త మోడళ్లు 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరాలు, డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తాయి.

రియల్‌ మీ ఎక్స్ 3 సిరీస్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC తో వస్తుంది. రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటంటే రియల్‌ మీ ఎక్స్ 3 సూపర్‌జూమ్ 5x ఆప్టికల్ జూమ్‌ను అందించడానికి పెరిస్కోప్-స్టైల్ లెన్స్ సెటప్‌తో వస్తుంది, అయితే రియల్‌ మీ ఎక్స్ 3 లో 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో టెలిఫోటో లెన్స్ ఉంది.

రియల్‌ మీ ఎక్స్ 3, రియల్‌ మీ ఎక్స్ 3 సూపర్ జూమ్ ధర

భారతదేశంలో రియల్‌ మీ ఎక్స్‌3 ధర రూ. 6జి‌బి + 128జి‌బి స్టోరేజ్ వేరియంట్‌కు 24,999 రూపాయలు. 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 25.999. రియల్‌ మీ ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌లో 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ. 27,999, 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 32.999.రియల్‌ మీ ఎక్స్ 3, రియల్‌ మీ ఎక్స్ 3 సూపర్ జూమ్ రెండూ ఆర్కిటిక్ వైట్, గ్రేసీయార్ బ్లూ అనే రెండు విభిన్న కలర్  ఆప్షన్స్ లో లభిస్తాయి.

రెండు ఫోన్‌ల సేల్స్ జూన్ 30న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) ఫ్లిప్‌కార్ట్, రియల్‌.కామ్ ద్వారా ప్రారంభమవుతుంది. ప్రీ-బుకింగ్స్ ఈ రోజు రాత్రి 8 గంటలకు నుండి జూన్ 27 వరకు కొనసాగుతాయి. తరువాత  ఫోన్లు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా అందుబాటులోకి వస్తాయి. 12జి‌బి + 256జి‌బి  స్టోరేజ్ వేరియంట్ కోసం EUR 499 (సుమారు రూ. 42,500) ధర ట్యాగ్‌తో రియల్‌మే ఎక్స్ 3 సూపర్‌జూమ్ స్మార్ట్ ఫోన్ గత నెలలో యూరప్‌లో ఆవిష్కరించచారు.

రియల్‌ మీ ఎక్స్3 ఫీచర్స్

డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 రియల్‌ మీ యుఐ, 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1,080x2,400 పిక్సెల్స్) అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే, డిస్‌ప్లే ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855, 8జి‌బి ర్యామ్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ సామ్ సుంగ్  జిడబ్ల్యు 1 ప్రైమరీ సెన్సార్‌, ఎఫ్ / 1.8 లెన్స్‌, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్‌, ఫోన్ వెనుక భాగంలో 12 మెగాపిక్సెల్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌ ఎఫ్ / 2.5 ఎపర్చరు టెలిఫోటో లెన్స్ ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్ కోసం రియల్‌ మీ ఎక్స్ 3 ముందు 16 మెగాపిక్సెల్ సోనీ కెమెరా సెన్సార్‌ ఎఫ్ / 2.0 లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌ కలిగి ఉంది.

. రియల్‌ మీ ఎక్స్3 లో 128జి‌బి, మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్, కనెక్టివిటీలో 4 జి, వై-ఫై 802.11, బ్లూటూత్ వి5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటో మీటర్, ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అదనంగా, డాల్బీ అట్మోస్ ఉన్నాయి. 30డబల్యూ డార్ట్ ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ అంతేకాకుండా ఫోన్ 202 గ్రాముల బరువు ఉంటుంది.

రియల్‌ మీ ఎక్స్3  సూపర్ జూమ్ ఫీచర్స్
రియల్‌ మీ ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌లో రియల్‌ మీ 3 తో ​​చాలా పోలికలు ఉన్నాయి. ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌,  ఆండ్రాయిడ్ 10 లో రియల్‌ మీ యుఐ, 6.6-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080x2,400 పిక్సెల్‌లు) అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే, అదేవిధంగా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855, సూపర్‌జూమ్ 12 జీబీ ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్‌, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ జిడబ్ల్యు 1 ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 1.8 లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉంది.

రియల్‌మే ఎక్స్‌ 3 సూపర్‌జూమ్ వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌, పెరిస్కోప్-స్టైల్ లెన్స్ సెటప్‌తో ఎఫ్ / 3.4 ఎపర్చర్‌, 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌ను అందిస్తుంది. వెనుక కెమెరా సెటప్ ఆస్ట్రో-ఫోటోగ్రఫీ కోసం ప్రీలోడ్ చేసిన స్టార్రి మోడ్‌తో కూడా పనిచేస్తుంది.

రియల్‌ మీ ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్‌ఎక్స్ 616 ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 2.5 లెన్స్‌, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో రానుంది. రియల్‌ మీ ఎక్స్‌3 సూపర్‌జూమ్‌లో 256 జీబీ యుఎఫ్‌ఎస్‌ 3.0 బూస్ట్‌ స్టోరేజ్‌ని రియల్‌ మీ అందించింది.

కనెక్టివిటీలో 4జి, వై-ఫై 802.11, బ్లూటూత్ వి5.0, జిపిఎస్, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది రియల్‌ మీ ఎక్స్ 3 లో లభించే అదే సెన్సార్, ఇంకా, ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 30డబల్యూ  డార్ట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఇచ్చే 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ , హై-రెస్ ఆడియో టెక్నాలజీ ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios