చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల మధ్యే పోటీ సాగుతోంది. బడ్జెట్ ధరలో సెల్ ఫోన్లు అందుబాటులోకి తెచ్చిన రెడ్ మీ సంస్థకు ధీటుగా అదే చైనా సంస్థ రియల్ మీ పోటీ పడుతోంది. ఎక్కువ ఫీచర్లతో తక్కువ ధరకు మంచి ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వస్తోంది. తాజాగా రియల్ ఎక్స్ మీ 2 ప్రో పేరుతో మరో నూతన మోడల్ స్మార్ట్ ఫోన్‌ను అంతర్జాతీయ విపణిలోకి విడుదల చేసింది. 

ఈ మొబైల్ ఫోన్ డిసెంబర్ నెలలో భారత మార్కెట్లోకి తేనున్నట్లు రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ‘పై’ ఓఎస్‌తో పని చేస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ కలిగి ఉన్న ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తీసుకు వస్తోంది రియల్ మీ.

4000 ఎంఎహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ గల ఈ ఫోన్ 50 వాట్ సూపర్ వూక్ ఫ్లాష్ చార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. దీన్ని ప్రొప్రైటరీ టెక్నాలజీతో కేవలం 35 నిమిషాల్లోనే ఫుల్ చార్జీ చేసుకోవచ్చు. ఇందులో ఐదు కెమెరాలు ఉన్నాయి. ముందు సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సర్‌తో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు.

బ్యాక్ మూడు కెమెరాలు పని చేస్తాయి. వాటిలో శామ్‌సంగ్ జీడబ్ల్యూ 1 ప్రైమరీ సెన్సర్ తో 64 ఎంపీ కెమెరా ఉంటుంది. దీంతోపాటు 13 ఎంపీ సెకండరీ కెమెరా అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో 115 డిగ్రీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటో తీయొచ్చు. ఇవి కాకుండా 8 ఎంపీ టెరిటరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ కూడా ఉన్నాయి. 

ఈ మొబైళ్లలో అత్యుత్తమ సౌండ్ కోసం హై రిజల్యూషన్ టెక్నాలజీ డాల్బీ అట్మాస్ స్పీకర్లు పొందు పరిచారు. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానున్నదని రియల్ మీ తెలిపింది. 

6జీబీ ర్యామ్ విత్ 64 జీబీ అంతర్గత మెమొరీ ధర రూ. 27,200 (2699 యువాన్లు), 8జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ మోడల్ ఫోన్ ధర 2899 యువాన్లు (రూ.29,200), 12 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.33,200 (3,299 యువాన్లు)గా నిర్ణయించింది రియల్ మీ. 

ఇప్పటికే రియల్ మీ ఎక్స్ 2 ప్రో మాస్టర్ ఎడిషన్ ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను నవోతో పుకాసవా అనే జపనీస్ డిజైనర్ ప్రత్యేకంగా డిజైన్ చేశారని పేర్కొంది. ఫ్రోస్టెడ్ గ్లాస్ ప్రొటెక్షన్, బ్రిక్, సిమెంట్ రంగుల్లో రియల్ మీ ఎక్స్ 2 ప్రో ఫోన్ లభ్యం కానున్నది. ఇది కేవలం 12 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్లలో లభిస్తుంది.