అతి తక్కువ సమయంలోనే స్మార్ట్ ఫోన్ రంగంలో మంచి అమ్మకాలను చేసిన స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం రియల్ మి ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని రియల్ మి స్మార్ట్ ఫోన్లలో అప్ డేట్  ద్వారా అందించనుంది. వివోవైఫై ఫీచర్‌ను అందుకున్న మొట్టమొదటి ఫోన్‌గా రియల్‌ మి ఎక్స్ 2 ప్రో ఉంటుందని రియల్‌ మి  సీఈఓ మాధవ్ శేత్ అన్నారు. 

రియల్ మి ప్రాడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని అన్ని ఇతర ఫోన్‌ల కోసం ఈ ఫీచర్ రోల్ అవుట్ టైమ్‌లైన్‌ వీడియోను కూడా ప్రకటించింది.రియల్‌ మి యు1, రియల్‌ మి1 వంటి పాత ఫోన్‌లకు కూడా ఈ ఏడాది మార్చి నెల చివరిలోగా అప్ డేట్ వస్తుందని అన్నారు.

also read అమెజాన్ మరో రికార్డు...ప్రపంచ దేశాలలో 50 శాతం....

వివోవైఫై ఫీచర్ ఎప్పుడు విడుదల  అవుతుండి అనే సందేహాలకు  సమాధానంగా రియల్‌ మి  సీఈఓ మాధవ్ శేత్  స్పందిస్తూ ఈ నెలలోనే ఇది ప్రారంభమవుతుందని తెలిపారు. మొదటిగా రియల్‌ మి ఎక్స్‌ 2 ప్రో స్మార్ట్ ఫోన్ జనవరిలో అప్‌డేట్‌ను అందుకుంటుందని,

ఆ తరువాత రియల్‌ మి ఎక్స్‌ 2, రియల్‌  మి ఎక్స్‌టి,, రియల్‌ మి ఎక్స్‌, రియల్‌ మి 5ప్రో, రియల్‌ మి 3ప్రో, రియల్‌ మి 5, రియల్‌ మి 5ఎస్ మోడల్ స్మార్ట్ ఫోన్లకు తరువాత ఫిబ్రవరిలో రియల్‌ మి 5ఐ అప్ డేట్ వస్తుందని చెప్పారు. మిగతా స్మార్ట్ ఫోన్‌లు అంటే రియల్‌ మి3, రియల్‌ మి 3ఐ, రియల్‌ మి 2ప్రో, రియల్‌ మి యు1, రియల్‌ మి 1, రియల్‌ మి సి2, రియల్‌ మి 2, రియల్‌ మి సి1  స్మార్ట్ ఫోన్లకు మార్చి నాటికి అప్ డేట్ అందుకుంటాయి.

వివోవైఫై లేదా వాయిస్ ఓవర్ వైఫై వినియోగదారులను వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా  ఆన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది.ఈ ఫీచర్ కోసం ప్రత్యేక యాప్ లాంటివి అవసరం లేదు. మీ టెలికాం ఆపరేటర్ సర్వీస్ అందిస్తున్నందున అన్నీ స్మార్ట్ ఫోన్‌లలో ఉపయోగించవచ్చు. గత నెలలో ఈ ఫీచర్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి నెట్వర్క్ ఎయిర్‌టెల్, ఇది మొదటిసారి ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

also read ఫోన్‌పే యాప్ కొత్త ఫీచర్... కాష్ విత్ డ్రా కూడా చేసుకోవచ్చు...

ఆ తరువాత ముంబై, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి నగరాలకు ఈ ఫీచర్ తీసుకువచ్చింది. ఇప్పుడు పాన్-ఇండియా ప్రాతిపదికన అందుబాటులో ఉంది. రిలయన్స్  జియో నెట్వర్క్ ఈ నెల ప్రారంభంలో వివోవై-ఫై కాలింగ్ సేవను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. జియో వై-ఫై కాలింగ్ సేవకు 150 కి పైగా హ్యాండ్‌సెట్ మోడల్స్ సపోర్ట్ చేస్తాయని ముంబైకి చెందిన టెల్కో పేర్కొంది.


రియల్‌ మి తన మొదటి ఫిట్‌నెస్ బ్యాండ్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని, రియల్‌ మి 5ఐ మే నెలలో ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను అందుకుంటుందని ప్రకటించింది.