స్మార్ట్ ఫోన్ రంగంలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రాండ్ రియల్ మీ. రియల్ మీ స్మార్ట్ ఫోన్స్ రంగంలో  ఇప్పుడు కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్  చేయబోతుంది. రియల్ మీ నుండి నార్జో 10, నార్జో 10ఏ స్మార్ట్ ఫోన్లను మే 11వ తేదీన లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో రియల్ మీ ఈ లాంచ్ కు సిద్ధం అయింది. ఈ కొత్త నార్జో సిరీస్ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్నాయి. నార్జో 10 స్మార్ట్ ఫోన్ ను 48 మెగా పిక్సెల్ కెమెరాతో  లాంచ్ చేయనున్నట్లు రియల్ మీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

also read గ్రామాల్లోనూ పెరుగుతున్నా నెటిజన్లు.. నెట్ యూజర్లలో 14% చిన్నారులే ..


ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కార్యక్రమం మే 11వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు జరగనుంది. దీనికి సంబంధించిన లింక్ ను రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ ఫోన్లు మార్చి 26వ తేదీనే లాంచ్ కావాల్సి ఉండగా, కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.

తర్వాత ఏప్రిల్ 21వ తేదీన లాంచ్ చేయాలని అనుకున్నప్పటికీ ఈ-కామర్స్ వెబ్ సైట్ల కార్యకలాపాలపై ఆంక్షలు ఉండటంతో లాంచ్ చేయలేకపోయింది. ముందుగానే రికార్డ్ చేసిన వీడియోను రియల్ మీ ఈ సందర్భంగా పోస్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఇప్పటికే కొన్ని లీకయ్యాయి.

వీటి ప్రకారం రియల్‌మీ నార్జో 10 స్మార్ట్ ఫోన్ లో వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్‌ను అందించనున్నారు. రియల్‌మీ నార్జో 10ఏలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించారు. ఈ రెండు ఫోన్లు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలను అందించనున్నాయి.