న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం రియల్‌మీ ఈ నెల 30వ తేదీన (మంగళవారం) మలేసియాలో ఆన్‌లైన్‌లోనే మధ్యాహ్నం 11 గంటలకు (8.30 ఐఎస్టీ) ‘రియల్‌ మీ సీ11’ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనున్నది. అయితే, మార్కెట్లో ఆవిష్కరించక ముందే దాని ధర ఆన్‌లైన్‌లో లీకైంది.

రియల్‌మీ సీ11 2జీబీ ర్యామ్ విత్ 32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర మన కరెన్సీలో రూ. 9,590 ఉండే అవకాశం ఉంది. ఇక 3 జీబీ ర్యామ్ విత్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,120 పలుకుతుందని తెలుస్తున్నది. ఈ ఫోన్ మింట్ గ్రీన్, పెప్పర్ గ్రే రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. 

రియల్‌మీ సీ11 మోడల్ ఫోన్ 6.5 అంగుళాల డిస్‌ప్లేతోపాటు ఆండ్రాయిడ్ 10 ఓఎస్ సౌకర్యం కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే తొలిసారిగా మీడియా టెక్ హెలియో జీ35 గేమింగ్ ప్రాసెసర్ వినియోగించిన ఫోన్ ఇదే.

also read అమెజాన్ ఉద్యోగుల సమ్మె.. ప‌ట్టించుకోవ‌డం లేదంటు ఆందోళ‌న.. ...

13 ఎంపీ+2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ వంటివి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ ఫోన్‌లో అదనంగా 32 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డు సాయంతో పెంచుకునేందుకు వెసులుబాటు ఉంది. ఫొటోలు, వీడియోల కోసం డ్యూయల్ రేర్ కెమెరా కలిగి ఉన్న ఫోన్ ఇదే.

ఫోన్ విపణిలో అడుగు పెట్టకముందే ఓ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో దీని వివరాలు బహిర్గతమయ్యాయి. ఇది ‘సీ3’ ఫోన్‌కు సక్సెసర్ మోడల్‌గా ‘సీ 11’ వస్తోంది. జూలై ఒకటో తేదీ నుంచి రియల్ మీ సీ 11 మోడల్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.