ముంబయి: రిటైల్ స్టోర్లు, షాపింగ్ మల్ల్స్ వద్ద చేసే అన్నీ కొనుగోళ్లకు కార్డ్ చెల్లింపులపై ట్యాప్-అండ్-గో పేమెంట్ అమలుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అన్నీ పేమెంట్ నెట్‌వర్క్‌లకు వీసా, మాస్టర్ కార్డ్, ఎన్‌పిసిఐలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇటువంటి లావాదేవీలు సురక్షితమైనవి తెలిపింది.

ఇక నుంచి క్రెడిట్ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా చేసే అన్ని రకాల చెల్లింపులూ కాంటాక్ట్‌ ఫ్రీగా ఉండేలా చర్యలు చేపట్టింది . అందుకోసం పేమెంట్‌ నెట్‌వర్క్‌ కంపెనీలైన వీసా, మాస్టర్‌కార్డ్, ఎన్‌పీసీఐలకు ఆర్బీఐ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా చిప్‌ లేని డెబిట్, క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపినప్పుడు పిన్‌ ఎంటర్‌ తప్పనిసరి, అయితే, కార్డుల్లో చిప్‌ వచ్చిన తర్వాత పరిస్థితి కొంత మారిపోయింది.

 చిప్‌తో వచ్చిన కొత్త కార్డులకు కూడా రూ.2000 మించిన బిల్లులకు తప్పనిసరిగా పిన్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే, కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా చెల్లింపులన్నీ కాంటాక్ట్‌ ఫ్రీగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పేమెంట్‌ నెట్‌వర్క్‌ కంపెనీలను ఆర్బీఐ ఆదేశించింది.

also read ఫ్లిప్‌కార్ట్‌ కీలక ఎగ్జిక్యూటివ్ రాజీనామా... కొత్త సి‌ఎఫ్‌ఓగా శ్రీరామ్ వెంకటరమణ...


"లావాదేవీల విలువతో సంబంధం లేకుండా ఈ‌ఎం‌వి చిప్, పిన్ కార్డులతో కార్డ్-ప్రెజెంట్ (సిపి) లావాదేవీలు కాంటాక్ట్‌లెస్ మోడ్‌లో ప్రాసెస్ చేయబడతాయి" అని ఆర్‌బి‌ఐ దేశంలోని కార్డ్ నెట్‌వర్క్‌లకు పంపిన ఇ-మెయిల్‌లో తెలిపింది.బిల్లు మొత్తం ఎంతైనా సరే మీరు కార్డును స్వైప్‌ చేస్తే చాలు పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరమే లేదు.

పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ కు మీ కార్డు చూపితే చాలు పేమెంట్‌  చేసేయొచ్చు. పిన్‌ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. దీనివల్ల పలు సమస్యలు వస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.కార్డుల లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ట్యాప్-అండ్-గో లావాదేవీలు ప్రారంభించనున్నారు. 

వినియోగదారులు తమ కార్డులను స్వైప్ చేయడం ద్వారా లావాదేవీలు చేయవచ్చు.ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇటువంటి లావాదేవీలు 40% పెరిగాయని సిఇఒ అజయ్ బంగా బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.