దోహాకు చెందిన ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (క్యూఐఏ) జియో ఫైబర్ లో 1.5 బిలియన్ డాలర్ల (రూ. 11,200 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. రిలయన్స్ సంస్థ  ఫైబర్-ఆప్టిక్ ఆస్తులను జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలువబడే మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్ట్ (ఇన్విట్) లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టనుంది.

ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఇందుకోసం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తో ముందస్తు చర్చలు జరుపుతోంది. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో వాటాల అమ్మకాల ద్వారా 20 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన తరువాత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇప్పుడు జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ జియో ఫైబర్ ఆస్తులను మోనటైజ్ చేయాలని చూస్తోంది.

ఇన్విట్(InvIT) ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల ఫైబర్ నెట్‌వర్క్‌ను మరింతగా 1.1 మిలియన్ కిలోమీటర్లకు విస్తరించాలని యోచిస్తోంది. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీతో ఒప్పందం కోసం సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, మొయిలిస్ అండ్ కో, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్‌ను రిలయన్స్ పెట్టుబడి బ్యాంకర్లుగా నియమించింది.

also read గూగుల్ ప్లేస్టోర్ నుండి 29యాప్స్ తొలగింపు.. వెంటనే మీరు వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి ...

గత సంవత్సరం, కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ నేతృత్వంలోని కన్సార్షియం రిలయన్స్‌లో 25,215 కోట్ల పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్, మొయిలిస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు.

మార్చి 2019లో రిలయన్స్  టెలికాం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి ఫైబర్ బిజినెస్ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌ డీమెర్జ్ చేసింది. మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా భారతదేశంలో 5జి వ్యవస్థ అభివృద్ధిలో జియో 5జి నెట్‌వర్క్, జియో ఫైబర్ ఆస్తులు కీలక పాత్ర పోషిస్తాయని ఆర్‌ఐఎల్ తన ఎఫ్‌వై 20 వార్షిక నివేదికలో తెలిపింది.

5జి నెట్వర్క్ అత్యాధునిక వైర్‌లైన్ సేవలను అందించే ప్రణాళిక జియోలో ఉంది. ప్రస్తుతం, జియో ఫైబర్ నెలవారీ ప్లాన్ రూ.699 నుండి ప్రారంభమై రూ.8,499 వరకు ప్లాన్స్ ఉన్నాయి.